పుట:Sri Mahabagavathamu Vol 1.pdf/210

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

38


వ. మఱియు గంగానందనుండు వినయ ప్రేమ సుందరులైన పాండునందనులం గూర్చుండ నియోగించి, మహానురాగ బాష్పసలిల సందోహ సమ్మిళిత లోచనుండై యిట్లనియె. (1-206)


ఆ.వె. ధరణిసురులు హరియు ధర్మంబు దిక్కుగాఁ , బ్రదుకఁదలఁచి మీరు బహువిధముల

నన్నలార ! పడితి రాపత్పరంపర, లిట్టి చిత్రకర్మ మెందుఁ గలదె ? (1-207)


ఉ. సంతసమింత లేదు ; మృగశాప వశంబునఁ బాండు భూవిభుం

డంతము నొంది యుండ మిము నర్భకులం గొనివచ్చి కాంక్షతో

నింతటివారుగాఁ బెనిచె ; నెన్నడు సౌఖ్యము పట్టు గానదీ

కుంతి ; యనేక దు:ఖములఁ గుందుచునున్నది ; భాగ్యమెట్టిదో ! (1-208)


ఉ. వాయువశంబులై యెగసి వారిధరంబులు మింటఁ గూడుచుం

బాయుచు నుండు కైవడిఁ బ్రపంచము సర్వముఁ గాలతంత్రమై

పాయుచుఁ గూడుచుండు ; నొక భంగిఁ జరింపదు ; కాల మన్నియుం

జేయుచునుండుఁ ; గాలము విచిత్రము ; దుస్తర మెట్టివారికిన్. (1-209)


ఉ. రాజఁట ధర్మజుండు ; సురరాజ సుతుండఁట ధన్వి ; శాత్రవో

ద్వేజకమైన గాండివము విల్లఁట ; సారథి సర్వభద్ర సం

యోజకుఁడైన చక్రి యఁట ; యుగ్ర గదాధరుఁడైన భీముఁ డ

య్యాజికిఁ దోడు వచ్చునఁట ; యాపద కల్గుట యేమి చోద్యమో ! (1-210)


ఆ.వె. ఈశ్వరుండు విష్ణుఁ డెవ్వేళ నెవ్వని, నేమి సేయుఁ బురుషుఁ డేమి యెఱుఁగు ?

నతని మాయలకు మహాత్ములు విద్వాంసు, లణఁగి మెలగుచుందు రంధులగుచు. (1-211)


వ. కావున దైవతంత్రంబైన పనికి వగవం బనిలేదు. రక్షకులు లేని ప్రజల నుపేక్షింపక రక్షింపఁ బుండరీకాక్షుండు సాక్షాత్కరించిన నారాయణుండు తేజో నిరూఢుండు గాక యాదవులందు గూఢుండై తన మాయచేత లోకంబులన్ మోహాతిరేకంబు నొందించు. అతని రహస్యప్రకారంబులు భగవంతుండైన శివుండెఱుంగు. మఱియు దేవర్షియగు నారదుండును భగవంతుండగు కపిలమునియు నెఱుంగుదురు. మీరు కృష్ణుండు దేవకీపుత్త్రుండని మాతులేయుండని తలంచి దూత సచివ సారథి బంధుమిత్త్ర ప్రయోజనంబుల నియమించుదు రన్నిటం గొఱంత లేదు. రాగాది శూన్యుండు, నిరహంకారుం డద్వయుండు, సమదర్శ