Jump to content

పుట:Sinhagiri-Vachanamulu.pdf/17

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

12

తులైన భక్త శిఖామణిగా పేరువడి సింహాచలంలో స్వామి సేవాతత్పరులుగా ఉన్నారు. స్వామివారి ఏకాంత సేవాసమయాల్లో చిందులు తొక్కుతూ, చిఱు తాళాలు వాయిస్తూ, దండెమీటుతూ, వచనభావంతో సింహగిరి నాధుణ్ణి కీర్తిస్తూ, పరవశించిపోతున్న తరుణంలో వీరిలో మేలిసాని, నృత్యగాన విద్యా విశారద. “జగన్మోహనాంగి" 'పదునొకండవ అవతారుండైన' కృష్ణమాచార్యులపై మరులు గొనటం, లోకమూ తామూ తమను అవతారంగా భావించు కొంటున్న కళాహృదయులు కృష్ణమాచార్యుల వారు ఆ “కళావంతురాలి" వలపు చిన్నెలకు పరవశించి విప్రనారాయణులవలే ఆమె కై వసంకావటం అబ్బురం ఏంకాదు. సుమారొక దశాబ్దం ఆమెతో గడిపిన తరవాతనే పొతకమూరి భాగవతులు ఆయనను సందర్శించి ఉంటారు. అంటే 1275 ప్రాంతంలో ఈ సంఘటన జరిగి ఉండవచ్చును.ఈ నాటికి రమారమి 45 ఏళ్ళ వయస్సుగల కృష్ణమాచార్యులు క్రీ౹౹ శ౹౹ 1230 వికృతి సంవత్సరంలో జన్మించి ఉంటారని ఒక బలమైన ఊహ ప్రస్తుతానికి చెయ్యవచ్చును.

సంకీర్తన సంప్రదాయం - శాసన ప్రమాణం

పూర్ణపురుషాయుష ప్రమాణంగా ఆరోజుల పరిపాటి ననుసరించి. నూరేళ్ళు కాక పోయినా 80, 90 ఏళ్ళయినా కృష్ణమాచార్యులు జీవించి ఉండ వచ్చును. ఆయన సంకీర్తన సంప్రదాయం అగ్రవర్ణాల వారిలోకంటే, ఇతరుల్లోనే ముఖ్యంగా సానుల్లో ఆయనకు వారితో ఉండే సాన్నిహిత్యాన్ని బట్టి. అందులో పొరి కుందే సొమర్ధ్యాన్ని బట్టి కొంతకాలం అయినా "నిలిచి ఉండా"లి క్రీ౹౹ శ౹౹ 1374 లో అంటే సుమారుగా కృష్ణమాచార్యుల పరమపదానికి 50 సంవత్సరాల తరవాత సంకీర్తన సంప్రదాయ పరిక్షణకు, అది సానులచే నిర్వహింప చేయటానికి వృత్తిని కల్పిస్తూ, సింహాచలంలో వేయించిన ధర్మశాసనం ఒకటి దీన్ని సమర్థిస్తోంది, ఇప్పటికి సింహాచలం లో కృష్ణమాచార్య సంకీర్తనం అన్నది ఈ సంప్రదాయం గానే నిర్వహింపబడుతూండటం కూడా ఇందుకు ఉపష్టంభకం. 1290 కృష్ణమాచార్యజన్మ సంవత్సరం అయివుంటే 1374 లోనే ఇంచుమించు ఆయన