Jump to content

పుట:Sinhagiri-Vachanamulu.pdf/125

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

56

సింహగిరి వచనములు

దయించిరి. అంత మరీచీ పుత్రుండైన కశ్యపప్రజాపతికి దక్షపుత్రియైన యదితికి సూర్య ఖగ త్వష్ట వివస్వత మిత్ర వింధ్యాంశుమతి గభస్తిపద్మ విష్వ్ణింద్రవరుణులను ద్వాదశాదిత్యు లుదయించిరి. తదనంతరంబు నత్రికి ననసూయకు చంద్రుం డుదయించె (దక్షప్రజాపతికిఁ) గూతురైన యశ్వని భరణి కృత్తిక మొదలైన యిరువదియేడు తారలు చంద్రునికి భార్యలైరి. మఱియును నింద్రాగ్ని యమ నైరృతి వరుణవాయు కుబేరేశాన్యులను అష్టదిక్పాలురను సృజించి, వారిని యష్టదిక్కులను నియమించి సరస్వతి సభాపతి రయమతి గాసతి దాంతి దాంతియును (?) నలకయును నీశాన్యయును నష్టపురంబులు వా(రికి ప్రసాదించితివి). అనాథపతీ, స్వామీ, సింహగిరి నరహరీ, నమో నమో దయానిధీ.