పుట:Shriimahaabhaarata-Shriimadraamaayana-Vimarsamu1907.pdf/9

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

viii

ష్ఠిరుని చరిత్రము వినినవారికందరికిని న్యాయ్యంబని తోచును. ఆ జన్మాంతము పరమోత్తమధర్మ చారియగు నీయన స్వచారిత్రము నంతయును గళింకితముగ జేయునట్లొకమా రాకస్మికముగ ననృతమాడునా ! ఒకవేళ యుద్ధవి జయార్థము తద్ద్వారా రాజ్యప్రాప్తికి నిట్టులాడిన నాడియుండ వచ్చునని యూహించుట కీయన రాజ్యభోగ వైరస్యము సుప్రసిద్ధమేగదా! కావున నీ విషయమున మహారాజావారి యభిప్రాయము సయుక్తికముగ నున్నది. మఱియు మహాభారత గ్రంథకర్త కౌరవ పక్షపాతి యగుటచే నిష్కళంకుఁడగు ధర్మరాజునకుఁగూడ నొక కళంకమున్నదని చెప్పుటకైన నీ కథను గల్పించియుండిన నుండవచ్చును.

కర్ణుని శౌర్యౌత్కృష్ట్యమును జూపుటకై మహాభారత కవి కొన్ని గాధలను గల్పించినాడు గాని యవి సత్యములని మనము తీసికొనగూడదని మహారాజావారి యభిప్రాయము. దాతృత్వముతప్ప మహాభారతమునందెల్ల నితని దుర్గుణము లే యగపడుచున్నవి. ఇట్టి దుర్గుణరాశి నిజమైన దాతయా యని విచారింపవలసియున్నది. ఈయన దాతయై యుండిన నుండవచ్చును. కాని యీ దాతృత్వమునకుఁ గారణము పరులచే శ్లాఘింపఁబడుట యందలి యభిలాషయేయని తోచుచున్నది. ఏమన, నిజమైన భూతదయలేనివాఁడు దాత కానేరడు. అట్టి భూతదయయే యుండినయెడల గర్ణకృతంబులని భారతములో