పుట:Shriimahaabhaarata-Shriimadraamaayana-Vimarsamu1907.pdf/74

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

41

గదనువివాహమయి గోకర్ణప్రభాసతీర్థములను సేవించి యతి వేషమున ద్వారకానగరముఁ జేరి యచట శ్రీకృష్ణులవారి యనుమతిని సుభద్రను బరిగ్రహించి, స్వస్థానమగు నింద్రప్రస్థపురముఁ జేరెను. అటుతరువాత ఖాండవదహనపుగథ కలదు. చదువరులు సంగతి సందర్భములను బాగుగ నాలోచించినచో నీకథ కర్ణునిచే నర్జునునిమీఁద వేయఁబడిన సర్పముఖశరముయొక్క మహిమకొరకు గల్పింపఁబడిన దని తోఁపక మానదు. సర్వభక్షకుఁ డగు నగ్ని కజీర్ణ మెట్లు కలుగును ? అర్జునుఁ డతితీవ్రముగాఁ బాణము వేయఁగలిగియుండినను, నా బాణముల నాధారములేని యంతరిక్షమున నెట్లు పందిరివలె నిలిపెను ? ఇంద్రునకు భూలోకమునం దీవన ముండుటకుఁ బ్రయోజనమేమి ? ఇట్లింక ననేకముగా నసందర్భములు గలవు..

రాజసూయయాగపుసభను మయుఁ డనువాఁడు చిత్ర తరముగ నిర్మించె ననియు, నర్జునుఁడు ముం దెప్పుడో యితనితో సఖ్యము చేసికొనె ననియుఁ గలదు. ఇందుకు నొకగాధయు నద్భుతమైన సభావర్ణనమును గల్పింపఁబడి యున్నది. మరి యేమియై యుండు ననిన:- దక్షిణదేశ వాసియైన మయునితో నర్జునుఁడు తీర్థయాత్ర కేగినపుడు సఖ్యము చేసియుండవచ్చును. అయితే అతఁడు రాక్షసుడుగాఁడు. తంజావూరు సమీపమున నుండు పట్టణమునం దుండువాఁడై యుండును. ఇప్పటికిని నాప్రాం