పుట:Shriimahaabhaarata-Shriimadraamaayana-Vimarsamu1907.pdf/64

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

31

యుండఁ దగదు. అందుఁ బ్రభువులగువారు మిగుల జాగ్రత్తగ నుండవలెను.

వారణావతమున లక్క యిండ్లలో గాల్పఁబడక తప్పించుకొనిపోయి తిరుగ దనపెదతండ్రియొద్దకుఁ బోయినను. బాహాటముగ ఒకచోట నివసించియుండిననుఁ దనకును, దనవారికి, నాపదలు కౌరవులవలన సంభవింపక మానవని ముందు యోచనకలిగి యేకచక్రపుర మను నొకబ్రాహ్మణుల పల్లెలో నుండి తననుఁ దనవారినిఁ గాపాడుకొనెను.

అర్జునుఁడు మత్స్యయంత్రమునుఁ గొట్టి ద్రౌపదిని వీర్య శుల్కనుగా స్వీకరించినపిదప దల్లియాజ్ఞను మీరలేక ధర్మరాజు తననలుగురుసోదరులతోడ నామెను వివాహమాడెను. ఇట్లు సోదరు లొకదానిని వివాహమాడుటకు ధర్మశాస్త్ర మొప్పదు. ఇందుకు మాత్రాజ్ఞయే కారణ మని తీసికొందమా యనిన నాకాలమున నట్లు చేయుట బాగుగ నుండిన నుండవచ్చును గాని యీకాలములో దూష్యమై యున్నది. పితరులయాజ్ఞను బ్రతివారును మీరకూడ దని సాధారణనీతి యుండినను నా కార్యము యొక్క మంచిచెడుగులను యోచించి మంచిపనుల యందు నడచుకొనవలెను. అందు స్త్రీలు నియమించువిషయములలో నిండుగ విచారింపవలెను. ద్రౌపదీదేవి యైదుగురు భర్తలు కలది యగుటచేతనేకదా యామెకు వస్త్రాపహరణము