పుట:Shriimahaabhaarata-Shriimadraamaayana-Vimarsamu1907.pdf/60

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

27

గట్టి తెచ్చి గురున కొప్పగించెను. బాల్యమున దూరదృష్టి లేకపోయినను జేసినప్రతిజ్ఞను లక్ష్యము చేయక తప్పినందున ద్రుపదున కీపరాభవము సంభవించెను. ద్రోణునిచే విడువఁబడి తనపురి, కేగి తిరుగఁ బగదీర్చికొనుటకుఁ బ్రయత్నింపుచు నుండెను. ద్రోణునిఁ గెలువఁ గోరి తనకుమారుఁ డగు ధృష్టద్యుమ్నునికిఁ బాగుగ నస్త్రవిద్యను నేర్పించెను. అంతటితోఁ దృప్తినొందక గొప్పవీరుని సాహాయ్యమునుఁ గోరి యస్త్రవిద్యను నేర్చినవారికి నెల్ల గష్టతమమైన యొకమత్స్య యంత్రమును నిర్మించి, దాని నెవ్వఁడు కొట్టునో వానికి దనకుమార్తె నిచ్చి వివాహము చేసెద నని ప్రతిజ్ఞ పట్టి చాటించెను. ఎవ్వరికిని గొట్ట శక్యముగాని యామత్స్యయంత్రము నర్జునుఁడు కొట్టి తనతల్లియాజ్ఞవలన జ్యేష్ఠకనిష్ఠసోదరులతోఁ గలిసి యాకన్యను వివాహ మాడెను. భారతయుద్ధమునందు బాండవ పక్షమున సేనలతో వచ్చి యుద్ధము చేసి యీద్రుపదుఁడు తుదను ద్రోణునిచే హతుఁ డాయెను.

2. ధృష్టద్యుమ్నుడు.

ఇతఁడు ద్రుపదునికుమారుఁడు. భారతయుద్ధమునందు బాండవులకు సేనాధిపతిగా నుండి పదునెనిమిదిదినములు మిగుల నేర్పుతో యుద్ధము చేసి యానాఁటిరాత్రి నిదురసమయమున దుష్టతముఁ డగు నశ్వత్థామచేఁ బలాత్కారముగఁ జంపఁ