పుట:Shriimahaabhaarata-Shriimadraamaayana-Vimarsamu1907.pdf/54

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

21

పాండవులు తనవథకొరకు శపథమును జేసినవారు కా రనియు లిసినవాఁ డగుటచేతను, తనకు గదాయుద్ధమె యభిమాన విద్య యగుటచేతను, భీముని దప్పక యాయుద్ధములోఁ జంపెద నని నమ్మిక గలిగి యెంచికొని హతుఁ డాయెను.

ఈ దుర్యోధనుని విషయములోనే కదా తల్లియగు గాంధారియు నాప్తుఁ డగువిదురుఁడు నతిదురాత్ముఁ డగు వీనిని విడిచి కులమును రక్షించికొను మని చెప్పి యుండిరి. అతిపుత్రప్రేమచేత ధృతరాష్ట్రుఁ డితనిని విడిచికొనలేక పోవుటయే కాక యావద్రాజ్యభారమును నితనియందే యుంచి యితనికి వశ్యుఁడై యుండుటచేతనె యింతయుపద్రవము పుట్టినది. రాజ్యద్రోహులను గులనాశకులను నెట్టివారి నైనను బ్రభువులు రాజ్యములోనుండి వెడలఁగొట్టుట రాజనీతి యై యున్నది. ఈనీతి పూర్వకాలమందె కాక యిప్పటికిని జరుగు చున్నది.

16. దుశ్శాసనుడు

ఇతఁడు ధృతరాష్ట్రుని రెండవకుమారుఁడు. దుర్యోధనునికిఁ దమ్ముఁడు. “అతనితమ్ముఁడె యితఁడు గాడా " యనునట్లు తనయన్నవలె నితఁడును దుష్టుఁ డయియె యుండెను. పాండవులనాశము కొరకు దుర్యోధనునిచేఁ జేయఁబడిన ప్రతికార్యమునకు ముఖ్యప్రోత్సాహకులలో నితఁడొకఁడై యున్నాడు.