పుట:Shriimahaabhaarata-Shriimadraamaayana-Vimarsamu1907.pdf/49

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

16

జయినపిదప దనకంటె నతఁ డధికుఁ డగు నని తలఁచి, తండ్రితో ననేకమాయోపాయములు చెప్పుకొని యొప్పించి, పాండవులను వారణావతమునకుఁ బంపి యచట వారలను లక్క గృహములో నుంచి కాల్పింపఁ బ్రయత్నించెను. ఆమోసపు గార్యమును విదురుఁడు పాండవులకు రహస్యముగఁ దెలిపి నందున వార లటుల కాక తప్పించుకొని బ్రదికిపోయిరి. ధర్మరాజు తనకు యువరాజ్యాభిషేకము జేసిన ధృతరాష్ట్రుఁడు దురాత్ముఁ డగు నీదుర్యోధనునిప్రార్థనకు లోఁబడి వారణావతమునకుఁ బంపించుటవలన నిట్టియాపద కలుగఁబోయినందున నాయాపదనుండి తప్పించుకొనినపిదప, దమపెదతండ్రి యగు ధృతరాష్ట్రునియొద్దకుం బోవుట సరికా దని తలఁచి, యేకచక్రపురమున కేగి యచట బ్రచ్ఛన్నముగ ద్రౌపదీస్వయంవరము వరకు సోదరులతోను దల్లితోను నుండెను. వారలపోక దెలియక హతులయి రని నమ్మి సంతోషముతో దుర్యోధనాదులు విఱ్ఱ వీగుచుండిరి. ఇండ్లలోఁబెట్టి కాల్చిచంపఁబోవుట, నీటద్రోయుట విషాన్నము బెట్టుట వీనికంటె దుష్టతరమైన పనియై యున్నది. ఇట్టిపని నెంతదుర్మార్గుఁ డైనను చేయఁబూనఁడు. ద్రౌపదీవివాహానంతరము ద్రుపదపురమున బాండవు లుండుటను చారులవలనఁ దెలిసికొని సంగతి సందర్భములనుఁబట్టి విధిలేక తనసోదరునికుమారులగు, వారినిఁ బిలిపించి ధృతరాష్ట్రుఁ డర్థ