పుట:Shriimahaabhaarata-Shriimadraamaayana-Vimarsamu1907.pdf/38

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

5

నాలోచింపఁగా నీభీష్మద్రోణకృపులకు జిరకాలమునుండి యుద్ధ కుతూహల మున్నట్టును, అందుఁ భీష్మునకు సర్వసేనాధిపత్యము చేయువేడుక యున్నట్టును, స్పష్టమగుచున్నది. తండ్రియిష్టము కొరకు రాజ్యమునే విడుచుకొన్న యితఁడు కౌరవసేనాధిపత్యమున కభిషిక్తుఁడయి యుప్పొంగెను. ఇదియే స్వచ్ఛందమరణము గల యీతనికి జావును సమకూర్చినది.

ఈయన శరతల్పగతుం డయ్యును, మాఘశుద్ధైకాదశి నాఁటివరకును బ్రాణములు ధరించియుండుట వలన నసాధారణ శక్తిగలవాఁడును, భగవదనుగ్రహమువలన శరవేదనయు క్షుత్పి పాసలును లేక బుద్ధిస్ఫూర్తి గలిగి యనేకధర్మములను ధర్మరాజున కెఱింగించినవాఁడును, నయి యున్నాఁడు. ఆధర్మములు, శాంతి, ఆనుశాసనిక , పర్వములలో ధర్మరాజుచే నడుగఁబడిన ప్రశ్నలకుఁ బ్రత్యుత్తర రూపమునఁ జెప్పియున్నాడు. ఇది యొకనాఁటిసంభాషణము కాక యనేకదినములు జరిగియుండిన దగుట చేతను, అడుగఁబడిన ప్రశ్న లే మాటిమాటికి వేరొకరూపమున నడుగఁబడుచున్నందునను నీభీష్ముఁడు చెప్పిననీతులును బునరుక్తము లైనటులను, ఛాందసము లైనటులను, స్వల్పముగ బరస్పరవిరోధములు గలిగియున్నట్లును జదువరులకు గానవచ్చును. అయినను మరణమును నిరీక్షించుచున్నట్టియు, వృద్ధుఁడయినట్టియు, నీభీష్ముడు తాను వినియున్న యావద్ధర్మములను