పుట:Shriimahaabhaarata-Shriimadraamaayana-Vimarsamu1907.pdf/36

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

3

ధర్మరాజు రాజసూయయాగము సేయునపు డగ్రపూజ చేయుతరుణమున నట్టి యగ్రపూజకు శ్రీకృష్ణుఁడే యర్హుఁడని భీష్ముడు చెప్పెను. ఈకౌరవులలో శ్రీకృష్ణులవారి మహిమ నెఱిఁగియున్న వాఁ డీయన యొక్కఁడే యని చెప్పవచ్చును.

కౌరవపాండవులు బాంధవముచే దనకు సములయి యుండుటయే కాక కౌరవులది యధర్మమైనప్పటికి దనను బోషించు ధృతరాష్ట్రున కసూయ కలుగు ననుతలంపుతోఁ భీష్ముఁడు కపటద్యూతమును మొదట వారించుటకుఁ బ్రయత్నింపక పోయెను. ఇది బాగు గాదు.

ద్రౌపదీవస్త్రాపహరణసమయమున గురువృద్ధుఁడగు నీతఁడు సమర్థుఁడయి యుండియు, నాదుష్టమైనపని నివారింపు మని ధృతరాష్ట్రునకుఁ జెప్పకపోవుట సరికాదు

అజ్ఞాతవాసములోఁ బాండవు లున్నప్పుడు వారికి దీక్షాభంగము చేయుటకయి దుర్యోధనుఁడు ప్రయత్నించునవసరమున వా రుండుదేశమునుఁ గనిపెట్టుటకుఁ గల కొన్నిగుర్తులను భీష్ముఁడు చెప్పెను. ఇది మంచిపని కాదు.

సంధిప్రయత్నములోఁ బాండవులు నీతిమంతులు సమర్ధులును గాబట్టి యట్టివారితోఁ గలహము వద్దనియు, వారిభాగ