పుట:Shriimahaabhaarata-Shriimadraamaayana-Vimarsamu1907.pdf/29

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

14

ఉపోద్ఘాతము.

వలసిన మంచినీతి కలదు. అది యేది యనిన : జడమైన యీ నారాయణాస్త్రమే నమ్రు లైనవారిని నేమియుఁ జేయక దానియంత నదియే యుపశమించినపుడు తదధిష్ఠానదేవత యగు శ్రీమన్నారాయణుఁడు శరణాగతవత్సలుఁ డౌట నిస్సందేహము, అట్టిదైవము నారాధించి భక్తిచేతగాని, ప్రపత్తిచేతగాని శాశ్వత విష్ణులోకమునుఁ బడయవలెను. అట్లు చేయక, ఆహా ! పాపము స్వల్పసుఖముకొర కశాశ్వతలోక ప్రాప్తినిఁ గోరి యితరదైవముల నేల యారాధింపఁ బూనవలెను

11. భారతయుద్ధానంతరము శ్రీస్వామివారు శిబిరమునకు వచ్చి యర్జునునిముందు దిగు మని పిదప దాము రథావతరణముచేసి రనియు, వెంటనే యారథము కాలిపోయిన దనియు, భీష్మద్రోణకర్ణాది వీరులయస్త్రముల వేడిమివలన నది యట్లు కాలిన దనియు, నంతవరకు శ్రీస్వామివారె తమమహిమవలన దానిని గాలనీయక యుంచి రనియుఁ జెప్పఁబడి యున్నది. ఇది యంతయుఁ జచ్చిన యధర్మవీరులయాధిక్యముకొరకుఁ గల్పింపఁ బడినది. ఇందుఁ గల యసందర్భము లెవ్వి యనఁగా : ఎప్పుడుగాని రథికుఁడు రథావతరణము చేసినపిదవ సారధి రథము డిగ్గును. అట్టిస్థితిలో ముందుగ నర్జునుని దిగు మని శ్రీకృష్ణుల వా రేల సెల వీయ వలెను ? మరియు శ్రీస్వామివా రనేక పర్యాయములోక్కొక్క నాఁటియుద్ధానంతరము రథమును దిగి