పుట:Shriimahaabhaarata-Shriimadraamaayana-Vimarsamu1907.pdf/194

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

161

ఏకారణముచేతఁ బంపియున్నను గుమారులకు రామాయణమును గానముచేయదగినంత వయసువచ్చువరకు నామె యొక్కయు నామె గర్భముయొక్కయు స్థితిని విచారింపక యుందురా? కావున నిది యసంభావితము. గర్భవతిగా నుండినభార్యను నామెకోరికఁ దీర్చుటకు వాల్మీకిమునియాశ్రమమునకుఁ గొన్నిదినములు పంపియుండిన నుండవచ్చును. అపు డచట నామెకుమారులను గనియుండవచ్చును. ఆయాశ్రమమున నాబిడ్డలు జన్మించినందున నాఋషి యిటీవల వారలకుఁ జదువు చెప్పియుండును. సంగతి సందర్భములనుబట్టి యిట్లు జరిగి యుండవచ్చునుగాని యాగ్రంథములో జెప్పఁబడిన ట్లుండనే యుండదుకదా! కావున దానిని మనము ప్రమాణముగఁ దీసికొనఁగూడదు. మఱియును జదువనేకూడదు.

ఇట్లు శ్రీమన్నారాయణుఁడు శ్రీరామరూపమున సవతరించి తాను జేయవలసిన పనులనుదీర్చి కుమారులకు బ్రాజ్ఞత వచ్చినపిదప వారికిఁ బట్టాభిషేకముచేసి శ్రీవైకుంఠమునకు విజయము చేసెను.

నా యీగ్రంథమున నెవ్వరిచరిత్రములు వ్రాసితినో వారిలో శ్రీరామకృష్ణులు శ్రీమన్నారాయణుని యవతారములని చెప్పియున్నందున భగవంతునియొక్క యవతారములుగ