పుట:Shriimahaabhaarata-Shriimadraamaayana-Vimarsamu1907.pdf/178

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

145

మునుజేరి యతనితో గలిసి యగస్త్యుని యాశ్రమమున కేగిరి అచటఁ గొన్ని దినములుండి యాయన యనుమతిని బంచవటీని జేరి యచట నొకపర్ణశాలనుఁ గట్టుకొని నివసించియుండిరి. అటులున్నతరిని రావణాసురుని చెల్లెలగు శూర్పనఖ శ్రీస్వామివారిని జూచి మోహించి యందుకు వా రంగీకరింపక పోవుటచే విముఖియై జన్మస్థానమునందున్న ఖరునియొద్దకు బోయి తాను శ్రీరాములవారివలన నవమానిత నైతినని తెలిపి వానిని యుద్ధమునకుఁ బురికొల్పెను. ఈ సందర్భమున రామలక్ష్మణులు కొంతవరకు దానితో సల్లాప మాడినట్లును, కొనను రాముల వారిచే బ్రేరితుఁడై లక్ష్మణుఁడు దాని ముక్కు సెవులుఁ గోసినట్లును, నొకకథ భ గలదు. సంగతి సందర్భములనుబట్టి దానితో సల్లాప మాడినట్లు తోచదు. స్త్రీ యగు దానిముక్కు సెవులు గోయుమని శ్రీస్వామివారు చెప్పియుందురా ? మోహపరవశయగుస్త్రీకి దాని కోరిక తీర్పఁబడనియపుడు కల్పితకారణము లనేకములు తనవిరోధమునుఁ దీర్చికొనుటకుఁ బ్రకటించుటఁ గలదు.

ఆపిదప ఖరాసురాదులు శ్రీస్వామివారిమీదికి యుద్ధమునకు వచ్చుటయుఁ జచ్చుటయుఁ జరిగెను. అంత శూర్పనఖ క్రోధముతీరక రావణునియొద్దకుబోయి పరస్త్రీ లోలుఁ డగు నతనితో సీతాదేవియొక్క సౌందర్యాదివిషయములను చెప్పి