పుట:Shriimahaabhaarata-Shriimadraamaayana-Vimarsamu1907.pdf/155

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

122

కోఁతినిఁ బరీక్షించి చూచినవాఁడు దీనిని నమ్మఁడు. తార మొదలగుస్త్రీలవర్ణనమునుబట్టి యోచింపఁగా వారినిఁ గోతులని యెవ్వరుసు నమ్మరు. స్త్రీపురుషులు తోకలను మూసి యా మూయకయా వస్త్రములను ధరించిరి ? గృహములయం దెట్లు నివసించిరి ? వేదశాస్త్రముల సభ్యసించుట ద్విజులు చేయుసంధ్యావందనాదికర్మలను జేయుట కోఁతు లేయాధారము పయినిఁ జరిపెను. కావున నట్టివారిని మృగములలోఁ జేరిన కోఁతు లని చెప్పుటకు వీలుపడదు. మరి యేమి యనిన : ఆదిసృష్టిలోఁ దామస, రాజస, సాత్వికు లని ప్రజలలో మూడు విభాగము లుండినటుల మనగ్రంథములన్నియు నైకకంఠ్యముగ నొప్పుకొనుచున్నవి. ఈభేద మనునది కేవలము వారివారిదేహ వర్ణమునుబట్టి యేరుపడెను. తామసు లనఁగా నల్లనివారు, లేదా? నిండుగ నవివేకులు. రాజసు లనఁగా నెఱ్ఱనివారు, లేదా ఒకరితో నొకరు కలహించువారు. సాత్వికు లనఁగా దెల్లనివారు, లేదా నెమ్మదియు నణకువయు గలవారు. పయి మూడుతెగలవారు కొంతకాలమువరకు బరస్పర వివాహములు చేసికొనిరి. అప్పుడు శరీరవర్ణమునుబట్టి యుండినభేదము మారిపోయెను. కావున మరియొకమార్పు వారిలోఁ జరగవలసివచ్చి విద్యాధరులు, యక్షులు, రాక్షసులు, గంధర్వులు, గుహ్యకులు, సిద్ధులు, భూతములు, పిశాచులు, కిన్నరులు