పుట:Shriimahaabhaarata-Shriimadraamaayana-Vimarsamu1907.pdf/141

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

108

చరిత్రయందును విపులముగఁ జర్చించి వ్రాయఁబడి యున్నది. కావునఁ జదువరు లిచ్చటఁ దత్తరపడక యాయాకథలను జదువఁ గోరుచున్నాను. ఇందు వానరవిషయము వాచస్పత్యములో వానరశబ్దమువద్దను, బ్రౌన్‌దొరగారివలన సమకూర్పఁబడిన తెనుఁగు ఇంగ్లీషు డిక్ష్ణరీయందు వానర హనుమచ్ఛబ్దముల వివరణమందును వీరు మనుష్యలే యని చెప్పఁబడి యున్నది.

యూరోపుదేశపుబండితులు కొంద రీగ్రంథశైలినిబట్టి శ్రీరాములవారికాలమె భారతకాలమునకుఁ దరిమిలా దనిచెప్పి యున్నారు. దాని నొప్పుటకు వీలులేదు. ఏమనిన పురాణములయందును శ్రీకృష్ణచారిత్రముగల భారతభాగవతము లందును శ్రీరామకథ చెప్పఁబడియున్నది. శ్రీకృష్ణులకాలవు వాఁడగు యుధిష్ఠిరుఁ డొకఋషివలన శ్రీరామకథను వినియున్నాడు. కావున శ్రీరాములవారికాలము భారతకాలము కంటె ముందె యయి యుండవలె ననుటలో సందేహ మేమియు లేదు.

శ్రీరాములవారిసన్నిధిలో వాల్మీకి కుశలవులచేతఁ బాడించినది సూక్ష్మరూపముగ నుండును. ఈగ్రంథమంతయు జాల కాలముపిదప నాఋషిపేరుతో నొకవిష్ణుభక్తుఁడు చెప్పియుండును. బ్రహ్మసూత్రములు చేసినవ్యాసులవారిపేరుతో నన్ని పురాణములు చెప్పఁబడియుండినటుల నిది వాల్మీకిపేరుతోనే