పుట:Shriimahaabhaarata-Shriimadraamaayana-Vimarsamu1907.pdf/118

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

85

రనుదానిని మనము నమ్ముటకు సందియ మేమి ? అందునుండియే కదా! 'వ్యాసోనారాయణోహరిః ' అని వ్యాసులవారికిఁ బ్రసిద్ధి కలదు.

ఈభాగవతగ్రంథకర్తయగు మొదటివాఁడు. విష్ణుభక్తుఁడును నతనిబరాత్పరుఁ డని నమ్మినవాఁడును నయి యున్నాఁడు. అచ్చులేనికాలములో నిట్టిగ్రంథములు తాటియాకుపుస్తకములలో వ్రాయఁబడియుండుటనుబట్టి మతాభిమానులు వారిమతమును బుష్టిచేయుకొరకు గొన్ని గాధలను, మతాంతరులు మనమతసంప్రదాయములయందును మనచే నమ్మఁబడినత్రిమూర్తులయందును లోపములను వ్యంగ్యముగ వ్యక్తపరచు దురుద్దేశముతో గొన్ని కొన్ని కథలను గల్పించిరి. అందు నీభాగవతమున బోపదేవుఁడను బౌద్ధమతాభిమాని ప్రచ్ఛన్నముగ మన మతస్థులతోఁ గలిసి, మన మెవ్వని బరాత్పరునిగ నమ్ముచున్నామో యట్టిశ్రీకృష్ణునియం దయుక్త ప్రవర్తనను గనబరచు దురుద్దేశముతో జలక్రీడ, రాసక్రీడ, పోడశ సహస్ర కన్యాపరిగ్రహము మొదలగుగాధలను నేర్పుతోఁ గల్పించి చేర్చెను. ఆగాధల ససందర్భము లని యోచింపక యసందర్భములకు మరికొన్ని యసందర్భములను గల్పించెడి స్వభావము గల మనపండితులు శరీరిశరీరన్యాయమును దెచ్చిపెట్టికొని పైగాధలవిషయమున సమాధానపడి యితరులకు బోధపరచు