పుట:Shriimahaabhaarata-Shriimadraamaayana-Vimarsamu1907.pdf/112

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

79

సర్వేశ్వరుఁ డయినవాఁడు యుద్ధము చేయనని ప్రతిజ్ఞచేసి భీష్మునిమీఁదికి మునికోలను జక్రమును బట్టికొని వెళ్లునా? చదువరులే యోచింపుడు ?

పదియేఁడవనాఁటియుద్ధమున ధర్మరాజు యుద్ధమునం దలసి శిబిరమున కేగెను. అట్లేగిన యన్నయొక్క క్షేమమును దెలిసికొనుటకు నర్జునుఁడు కోరఁగా 'ఇతఁడు కొంత యలయిక దీర్చికొనుట కిదియె సమయ' మని తలఁచి శ్రీస్వామివారు రథమును బాండవశిభిరమునకు బోనిచ్చిరి. అప్పు డీ కృష్ణార్జును లిద్దరును గర్ణునిఁ జంపి యావార్త తనకు దెలుపుటకయి వచ్చి రని తలఁచి ధర్మరా జుప్పొంగెను. పిదప నిజమైన కారణము దెలిసికొని 'కర్ణుని జంపక యుద్ధభూమినుండి వచ్చితివా ' యని యతికోపముతో నర్జునుని దూలనాడుచు 'నీచేత గాకపోయినయెడల నీధనుస్సుగుగాండివ మును శ్రీకృష్ణులవారి చేతి కి 'మ్మని కోపముతోఁ బలికెను. ఈయర్జునుఁడు తనగాండివము నితరుల కిమ్మని యెవ్వఁడు చెప్పునో వానితలఁ దునుముటకు మానసికశపథముఁ జేసికొని యున్నాఁడు. అందునుబట్టి ధర్మరాజుతలఁ దునుముటకు యత్నించెను. అపుడు శ్రీస్వామివారట్లు గాకుండజేసి యందుకు బ్రతిగా ధర్మరాజును దూలనాఁడుమని సమాధానపరచిరి. అ ట్లన్నను దూలనాడి యందుకుగాను దనవథకు బ్రయత్నింపఁగా నట్లు జరుగకుండ శ్రీస్వామివా