పుట:Shriimahaabhaarata-Shriimadraamaayana-Vimarsamu1907.pdf/100

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

67

శివకేశవులు యుద్ధము చేయుదురా! అందు నొకరక్కసుని కొరకు యుద్ధము చేసి రఁట, ఏమివింత ! చదువరులే యీ విషయము విచారింపుడు.

పిమ్మట, బౌండ్రకవాసుదేవుని శ్రీకృష్ణులవారు చంపిరి.

ఈమీఁద వ్రాసినకథయంతయు భాగవతదశమస్కంధములోనిదై యున్నది.

ఇంద్రప్రస్థపురంబునధర్మరాజు రాజసూయయాగము జేయఁబూని శ్రీకృష్ణులవారిని రావించెను. అపుడు దిగ్విజయమునకు ముందు జరాసంధునిఁ జంపవలయు ననియు, నతఁ డితరరాజులతోఁ గలిసినయెడల నజేయుఁడై యుండు ననియు శ్రీస్వామివారు ధర్మరాజుతోఁ జెప్పఁగా నతఁడు శ్రీకృష్ణభీమార్జునులను జరాసంధవిజయముకొరకు బంపెను. వారిలో భీముఁడు ద్వంద్వయుద్ధమున నతని సంహరించెను. ఆపయిని ధర్మరాజు రాజసూయయాగము చేయునవసరమున నగ్రపూజను శ్రీకృష్ణులవారు గయికొని నోటికివచ్చినట్లు తమ్మును దిట్టిన శిశుపాలుని వధించి ద్వారకానగరమును జేరిరి. ఆపిదప సర్వజ్ఞులగు శ్రీకృష్ణులవారు కుదరనిరాయభారముకొరకు ధర్మరాజు పనుపున గౌరవులయొద్ద కేల యరిగిరో యోచింతము.

శ్రీస్వామివారు రాయభారమునకు బోబోవుముం దర్జునునితో నిట్లు పలికిరి:-