పుట:Shrii-raamakrxshhna-suuktimuktaavali.pdf/207

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

28వ అధ్యాయము.

ముక్తి లేక జీవుని మోక్షము.

566. ప్రశ్న:- నరులందఱును భగవంతుని చూడ జాలుదురా?

జవాబు:- ఏనరుడును సదా పూర్ణోసవాసము చేయబోడు; కొందఱు ఉదయము తొమ్మిదిగంటలకే భుజింతురు; కొందఱు మధ్యాహ్నము; కొందఱు రెండుగంటలకు; యింకకొందఱు సాయంతనము; సూర్యుడుక్రుంకిన పిమ్మట ఆహారము తిందురు. అదేతీరుగా ఎప్పుడో ఒకప్పుడు, ఈ జన్మలోనో, లేక యింక కొన్నిజన్మల యనంతరమో, అందఱును ఈశ్వరసాక్షాత్కారమును పొందియేతీరుదురు.

567. లోభమోహముల జిక్కియున్న మనస్సు, పైబెరడునకు అంటుకొనియుండు పచ్చిపోకకాయ వంటిది. పోకకాయ పక్వము కానంతవరకును. తనరసముతోడనే పైడొల్లకు అంటుకొనియుండును. కాని సకాలమున దాని రసము యెండిపోయి అది డొల్లనుండి విడివడును; కదిలించినప్పుడెల్ల లొటలొటమనుచు తాను లోనవిడివడి యున్నటుల తెలుపును. అటులనే భోగము, ధనమునెడరాగమనుజిగురుఎండబారెనా, నరుడు ముక్తుడే!

568. "దేనికైనను నైజగుణముపోదు." అనిఒకడుఅనగా మఱొకడు "నిప్పుబొగ్గులోప్రవేశించి దానికి నైజమగు నలు