పుట:Shrii-raamakrxshhna-suuktimuktaavali.pdf/128

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

119

17వ అధ్యాయము.

అని ఆదేవదేవుడు ప్రత్యుత్తరమిడినాడు. కావున తెగలు సాంప్రదాయములు భిన్నములుగనున్నను బాధలేదు. ప్రతివాడును తనభక్తిసాధనలను తన సాంప్రదాయకధర్మములను శ్రద్ధతో నిర్వహించిన చాలును.

350. ఎవడు నిర్మలవిశ్వాసముతోడను, నిష్కపటభక్తితోడను సర్వేశ్వరుని యిచ్ఛకుస్వార్పణము కావించుకొనునో అతడువేగమే బ్రహ్మసాక్షాత్కారమును పొందును.

351. ఒకశిష్యుడు తనగురువుయొక్క అనంతమహిమయందు నిశ్చలవిశ్వాసముగలవాడై, కేవలము గురునామస్మరణ మాత్రాన ఏటిపైనడచిపోవుచుండెను. దీనిని కనిపెట్టిన గురువు "ఆహా! నానామమాత్రమునందేఎంతమహిమగలదో! కావున నేనుఎంతఘనుడను; ఎంతమహిమాఢ్యుడ నయియుండవలయును!" అని తలంచెను. మరునాడాగురువు "నేను, నేను నేను" అనుచు ఆనదిపైని నడచిపోవయత్నించెను. ఆతడు నీళ్లలో కాలుపెట్టెనో లేదో, తక్షణము మునిగి లోతునపడి పోయెను. పాపము అతనికిఈతరాదయ్యె. విశ్వాసము అద్భుతకార్యములచేయ సామర్ధ్యముకలది. అహంకారము నరునికి ప్రాణహానిగూర్చును.

352. ఒకడు నదినిదాటి పోవలసివచ్చెను. ఒకసిద్ధుడు వానికొకతాయెత్తునిచ్చి "ఇదినిన్నునదిని దాటించును." అనిచెప్పెను. ఆమనుష్యుడాతాయెత్తును చేతికికట్టుకొని నదిమీదుగానడచిపోవు చుండెను. ఆతడు ఏటినడుమపోవునప్పటికి, తనకింత విచిత్రశక్తినొసగిన తాయెత్తులోపల యేమున్నదో చూడవలయు