పుట:Shrii-raamakrxshhna-suuktimuktaavali.pdf/110

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

101

12వ అధ్యాయము.

అవన్నియు తనవనిభావించు నరునిప్రార్ధనలునిష్ప్రయోజనము.

302. కామక్రోధాది శత్రువులు ఎప్పుడులోబడుదురు? అని యడుగగా శ్రీరామకృష్ణులవారిట్లు ప్రత్యుత్తరమిచ్చిరి:- "ఈతీవ్రవాంఛలు ప్రపంచమువైపునకును యందలివిషయ భోగములవైపునకును నడుపబడునంతకాలమును అవి శత్రువులుగనేవుండును. వానిని భగవంతునివైపునకు నడుపునెడల అవియే నరునికి ఆప్తమిత్రవర్గమగును. అవివానిని భగవంతుని దఱిచేర్చును. సంసారమునెడలగలుగు కామమును భగవంతునివైపునకు త్రిప్పవలయును. తోడిమానవునిపైనిరేగు కోపమును, సత్వరము ప్రత్యక్షముకాలేదని భగవంతునిమీద చూపవలెను.

ఈరీతిగా తక్కినభావోద్రేకములను యన్నింటిని వినియోగించుకొనవచ్చును. ఈభావోద్రేకములను మొదలంట నాశముచేయుటకు వీలులేదు. వానిని తిన్ననిమార్గమునకు త్రిప్పవచ్చును.

303. సన్యాసులు కాషాయవస్త్రమును ధరించుటవలన లాభమేమున్నది? వస్త్రధారణలోఏమున్నది? - కాషాయవస్త్రముదానితోడి అనుసంధానమైయున్న నిర్మలభావములను స్ఫురింపచేయును. అరిగిపోయిన చెప్పులను, చిరిగిపోయిన గుడ్డలను వేసికొనుటవలన మనస్సున అవి నమ్రభావములు తోపచేయును. నీటగుదొరలాగులనుకోటులను, లాగూలునువేసి సొగసగు బూటులను తొడగినప్పుడు సహజముగా గర్వమును యాడంబరమును పురికొలుపును.