పుట:ShivaTandavam.djvu/80

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

మూడవది: తాండవమునకు రంగభూమి చిత్-అంబరము మానవ హృదయాంతర సీమయే. ఇది విజ్ఞులకు వేద్యమను అనుభూతిశాల. ఇచ్చట పరమశివుడు రంగస్థల మేర్పరచికొని, నృత్యమాడి, జీవునికి మోక్షమిచ్చును.

ఈ తాండవ మహాత్మ్యము ' చిదంబర ముమ్మని కోవై, ' తిరుములారి తిరుమంత్రము, ' ' ఉన్మై విలక్కము,' 'శివజ్ఞాన సిద్ధియర్ ' మున్నగు గ్రంథము లందు విపులముగా వర్ణింపబడియున్నది.

(ఓం) శి-వా-య-న-మః యను పంచాక్షరి తత్త్వమే ఈ నృత్యము యొక్క బాహ్య స్వరూప శబ్ద సంపుటియని ఉన్మై విలక్కమున వివరింపబడి యున్నది. ఏ తదుపాసనమే ఉపాసమునికి ద్వంద్వాతీత స్థితిని గూర్చి, శివమును గూర్చుననియు అందు ఉద్ఘాటింపబడినది.

శివప్రదోషస్తోత్రమున:-

కైలాస శైల భవనేత్రిజగజ్జనిత్రీం
గౌరీం నివేశ్య కనకాంచిత రత్నపీఠే
నృత్యం విధాతు మభివాంఛతి శూలపాణౌ
దేవాః ప్రదోష సమయేను భజంతి సర్వే

వాగ్దేవీ ధృతవల్లకీ శతమభోవేణుందధత్పద్మజః
తాలో న్నిద్రకరో, రమా భగవతీ గేయ ప్రయోషాడ్వితా
విష్ణుస్సాంద్ర మృదంగ వాదనపటుర్దేవాస్సమం తాత్‌స్ఖితా
సేవంతే తమనుప్రదోష సమయే దేవంమృడానీపతిమ్‌

గంధర్వ యక్ష పతగోరగ సిద్ధ సాధ్య
విద్యాధరామర వరాప్సర సాంగణాశ్చ
యేన్యే త్రిలోక నిలయాస్సహభూతవర్గాః
ప్రాప్తే ప్రదోష సమయే హరపార్శ్వసంస్థాః