పుట:ShivaTandavam.djvu/32

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

కర ముద్రికల[1] తోనె గనులఁ జూపులు దిరుగఁ
దిరుగు చూపులతోనె బరుగెత్త హృదయమ్ము
హృదయమ్ము వెనువెంటఁ గదిసికొన భావమ్ము
కుదిసి భావము తోనె కుదురుకోగ రసమ్ము
శిరము గ్రీవమ్ము పేరురము హస్త యుగమ్ము
సరిగాగ మలచిగండరువు[2] నిల్పిన యట్లు
తారకలు[3] జలియింపఁ దారకలు నటియింపఁ
కోరకములై గుబురు గొన్న జూటము నందు
నురగాలి నలి రేఁగి చొక్కి వీచిఁన యట్లు
పరపులై పడఁ గల్పపాదపంబులఁ బూవు

        లాడెనమ్మా! శివుఁడు
        పాడెనమ్మా! భవుఁడు

మొగ్గలై ప్రేమంపు బుగ్గలై యమృతంపు
నిగ్గులై దమలోన మొగ్గరంబులు గట్టి
నును సిగ్గుతో ముడిచికొని పోయెడు విధాన
పెను వెఱపుతో రాలి వణకాడెడు విధాన
బలపలని వెన్నెలలు జిలికించెడు విధాన
రోసంబు గ్రసియింప రూక్షమైన విధాన
వేసరికతో సరిగ వికసింపని విధాన

  1. హస్తముద్రిక యేవైపునకుండునో దానియెడ దృష్టియు, దానియందు మనస్సును, మనసునందు భావమును కేంద్రీకరింపవలెనని నాట్యాచార్య సంకేతము. అప్పుడే రసోద్భూతి కలుగును.
  2. బొమ్మ.
  3. కనుగ్రుడ్లు.