పుట:ShivaTandavam.djvu/21

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

భావపరిముగ్ధ గిరిజావనజతుల్యపదయావకరసాఽక్త శిరసం[1]
పీవరభుజం ప్రమథజీవనమముం సకలపావనతనుం హృదిభజే.

గంగాతరంగకణసంగ వికాసిజూటం
సంధ్యాంతరిక్ష మివ తారకితం[2] దధానః
నృత్యత్పదాఽగ్ర పరికల్పిత వేదజాతః
కుర్యాద్దయాం, త్రిభువనాఽఽలయదీపఏషః.

దధన్నేత్రం గౌరీ ప్రణయముకురం[3] మండనవిధౌ
ప్రసన్న స్మేరాఽస్యం లలితలలితం చాంద్రశకలం
మహాసంవిద్రూపం భుజగపతి భూషం శ్రుతిసతీ
వతంసం శంసామః కిమపి కిమపి బ్రహ్మసరసం.

గౌరీకటాక్ష రేఖా
చంద్రకితం[4] వక్ష ఆదధానాయ
పింగళజటా యనమో
గంగాకమనాయ, వేదవేద్యాయ.

  1. పార్వతీదేవి పదతామరసమునందలి లత్తుకచే రంజివబడిన శిరస్సు గలవాడు భరతశాస్త్రమందు "నిటాలతిలక" అను స్థానవిశేషము గలదు. ఆ యభినయమునందు బాదముతో దిలకముంచికొనునట్లు దానిని నిటలముపై నిలుపవలెను. పార్వతి యాయభినయమును జూపించుచుండగా నామె కాలు శివుని శిరస్సునకు దగిలినది. ఇద్దానినే "లలాట తిలక" మనియు వ్యవహరింతురు.
  2. నక్షత్రములచేత గూడినది.
  3. శివుని నేత్రములందు నీడ జూచుకొని పార్వతి తన యలంకారమును దిద్దుకొనుటచే, నతని నేత్రమామెకు లీలాదర్పణమైనది.
  4. నెమలి కన్నులవంటి కన్నులుగల.