పుట:Satavadhana Saramu - Tirupati Venkatakavulu.pdf/75

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

మొగల్ తుర్తి కోట

63

,


నల చరిత్ర,


చ||నలుడలయంచకారణమునన్ దమయంతిని బెండ్లియాడి పె
ంగముల నంది జూదమునగాగల కార్యము లొంది మీద గా
నలఁ బలుకష్టముల్ వడి యనంతర మాఋతుపర్ణుజేరి వే
డ్కలు చెలువార నావయి సుఖము ననుం డెను దానుఁబత్నీ యున్”.9

సోమరితనము,



ఆ|| వె|| చదువు మట్టుపడును సంసృతి చెడిపోవు
సంపదలు తొలంగు సౌఖ్య ముడుగు
గౌరవంబు వోవుఁ గావున సోమరి
తనముకన్న హీదవశయుఁగలదె10

వైష్ణవులు స్మార్తులు


సీ|| శివుని యాఖ్యానమ్ము చెవి సోకినంతన నిప్పు తొక్కిన కోఁతినియతి
గాంత్రు | శివు నాలయంబు కంగనఁ దాకినంతన గాలిసోకినరీతి గాఁ జ
రింత్రు | శివ దేవుఁ డూ రేగుసవసరమ్మునఁ దల్పు మూసి పెట్టుక యొ
క్కమూల నుంద్రు | వెలిబూ దె మెసఁటను బెట్టు వారల జూచి ప
కసకసగుచుఁ జప్పట్లుచరతు,
తే| గీ|| రహహ యేమంచు! వైష్ణవులైనవారి
చర్యలను, శివ కేశవస్వాములందు
సార్డులగువారు సమభక్తి సలుపుచుందు
రదియ న్యాయ్యం బటంచు మాకభిమతంబు11
దుర్ముఖ సం|| ఆశ్వయుజ కార్తికములలో రెండవసారి కాకినాడ
లో జరగిన యనేకావధానము లలోఁ గొన్ని పద్యములు

(సమస్య) మాకుల దాస: యెంతయభిమానము లేదుర చంద్రశేఖరా


ఉ||నాకు విభూతిరాయఁ డోక నాయకుఁడా యని నీదు భార్య ర
త్నాకరు చెట్ట వట్టు టది యారసి యుండియు సిగ్గు లేక ర
త్నాకరుఁ జంకఁ బెట్టికొని యక్కులటన్ దలఁ దాల్చి తౌర? భా
మాకుల దాన యెంత యభిమానము లేదుర చంద్ర శేఖరా1