పుట:Satavadhana Saramu - Tirupati Venkatakavulu.pdf/40

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

28

శ తా వ దా ససా రము, పూ ర్వార్థ ము


తే.గీ॥ సింహపురమున సివిలు జెడ్జి పదమ్ము
సను జెలంగెడి రామచంద్రయ్య నాడు
గాక తిరుపతి వేంకటకవుల నాడు
గాక కలిగేని యితకులకాల మంచు3

సుపన్యాసము లిచ్చిరి. సభకు విచ్చేసిన మ. రా. రా, డిస్ట్రిక్టు మునసపు వారైన డబ్ల్యు గోపొలాచార్యులవారును .... ....... ......... సభనందఱిని రావించిన హైకోర్టువకీలు గారైన మ.రా.రా. , టి. వి. వేంకట రామ య్యర్ బి. యే., బియల్ ., గారును . . . మొద లైన గొప్పవారలందఱును అపరిమితానందము నందిరి. ప్రతియవథానమును గ్రము మ్ముగ నెఱ వేఱినతోడ నే మితి లేని యానంద సూచకము లైన కరతాళములు చెలఁగెను.

ఈ కిందిపద్యములొక బాలునిచేఁ జదివింపఁ బడినవి,

క: సుమహితమాయవధాన మ, సమానపొండిత్య విహిత సరసోక్తులచే,
నమరె నతి హృద్యముగ స, త్ప్రమోదలహరీ ని మగ్న పండితచయమై,

క || పండితజన హృదయాబ్జాప్తుండు విజయపుష్య శుద్ధ పూర్ణిమ తిది మా
ర్తండ సువాసరమునను, నుద్దండుఁడు వెంకటకవి యవదాన మొనర్చెన్ 2.

క. - - - ఉద్దండుడు తిరుపతికవి యవధాన మొనర్చెన్ 3

క|| పండిత సంభావ్యమగున, ఖండ సభన్ సభ్యు లెల్ల ఘనత నొసంగి రీ
మండిత తిరుపతి వేంకట, పండితులకు సరసవాక్య సౌరగు లగుటన్ 4

అంతట సభవారికి నెల్లూరునకును మంగళదాయకము లైన శ్లోకములతో సభవి రమించబడినది.

కుప్పచ్చి లక్ష్మయ్య పెన్ పండు వోవరు సీయరు (అనియున్నది.)

........................

Two Pandits named cehellapilla Venkateswara Sastri and : Tirupaty Sastri performed Ashtava daanaam at a pablic meeting held on the 25 of January 1894 in the Nellore Hindu High school. The development of their memory was such that they were able to pay their attention to many things simultaneously and their performance .