పుట:Satavadhana Saramu - Tirupati Venkatakavulu.pdf/30

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

18

శతావధాన సారము,పూ ర్వార్థ ము


తేటగీ|| సంజ కెంజాయ చెన్నా రె సర్వభూసు
రాధికులు సంధ్య వార్చఁగా నాపగాస
మీపముల కేగి రుత్సాహ మింపుగుల్క-
మెలమెలన జీకటు ల్మైండుకొనఁగ 5.

ప్రహర్షిణీ - స్త్రీ విద్య పూర్వాచారమైనట్లు,

మొల్లాఖ్యా రఘుచరితం పురా కరో ద్వై
వెంగాం బాహరిచగీతం తథా చకార
తస్మా ద్వైసకలకలావిలాసజాలం
సర్వాభిః కిల నితరా మపేక్షణీయం6

సీసము – ప్లీడర్లు.

గెలియనట్టిదియైన గెల్చు నటంచును లాఁ జూచి కల్పసలను ఘటించి
తప్పు జెప్పు మటన్నదప్పుఁ జెప్పని వారి నాటి కబద్ధాలు
నూఱిపోసిజెడ్జిగారికి నేను జెప్పనిమాటలుప థ్యములుసుమీ యనివాని మోసపుచ్చి
రేపు ఫీ జిచ్చెద మాపిచ్చెన నటన్న గాదు తెమ్మని ముందుగానే కొనియు

తే! | వ్యాజ్య మొక వేళఁ బోయిన వాని సాక్షి
మీఁద నెప మిడి గెల్చిన మీఁదఁ బెట్టు
కొని నటింతురు ప్లీడరు కొంద ఱిలను
న్యాయ వాదుల మంచు సన్యాయలీల7

............................................................................................................

న్నాము...........................................మాచదువరుల కానందమును గలిగింపగల యిం కొక విచిత్రమునుగూర్చి యీ సంచిక లో మిక్కిలి సంతోషముతో వ్రాయగలుగుచున్నాము ............ ............. .................. ఇప్పుడి రువది సంవత్సరములకంటె మిక్కిలి యధికముగాని వయస్సుగలిగి యీ లోపల నే గురుశిష్య సంప్రదాయముల విషయమై సాధారణముగ మనము హిందువులలోఁ గాంచుచుండెడి వానిక కంటె భిన్నము గాని పద్ధ తులకు లోబడీయే సంస్కృత వ్యాకరణమందుఁ గాకి నాడ, బందరు, మొదలగు పుర ములలో సుప్రసిద్ధులగు పండితులచేతఁగూడ శ్లాఘనీయ మైనట్లంగీక రింపఁబడిన సంపూ ర్ణపాండిత్యమును సంపాదించి యంతతోఁ దృప్తినొందక ఆంధ్రగీర్వాణ భాషలయందు మృదుమధురరీతిని మహాసభలలో శతఘంకంటకవిత్వము చెప్పుటయేకాక, అష్టావధానము వ్యస్తాక్షరి ఆకాశపురాణము మొద లైన వైచిత్ర్యములచేఁగూడ విద్వత్ బృందములను మెప్పించి యిదివఱకే విద్వత్కవులని బిరుదొందిన బుద్ధిమద గ్రేసరులిద్దరినిగూర్చియెవ్వ