ఈ పుట అచ్చుదిద్దబడ్డది
శశికళ
18
నిరతిశ యానందమ్మై
పరిమళాంగి ప్రవిమలాంగి
పారిభద్ర ప్రసూనాంగి
విరసిం దహొ విదురేఖై
కురిసిం దహొ సురమధువై !
దివి తరించి భువి తరించి
అవతరించె నా ప్రణయిని
దిశామూర్తి శశి కళాఖ్య
నిశామూర్తి శశి కళాఖ్య
గోదావరి పాడిందీ
గోవత్సం ఆడిందీ
సాయంతన కల్య బాల
చల్లెను పన్నీటి జాలు,
చల్లెను స్వర్ణాక్షతలను
చదల దేవి ఆశీస్సుల !