ఈ పుట ఆమోదించబడ్డది
9
శశికళ
తుంగ వీచీ శిఖర
భంగ రేఖా రచిత
శుక్తి గర్భాంతరిత
ముక్తా ఫలాచ్ఛవో !
ఓ చెలీ నీవెవరు
ఓ చెలీ నీవెవరు !
కలలోని పొలతివా ?
కతలోని మెలతవా ?
ప్రత్యూష బాలాధరారుణిమవో
నిత్య నూతన భాను కిరణమ్మవో !
గాఢ రజనీ హృదీ
వ్యూఢ గంభీరస్థ
తమసులో నుదయించు
విమలభాః కణమవో ?
ఓ చెలీ నీవెవరు ?
ఓ చెలీ నీవెవరు ?
కలలోని సుందరివొ ?
కతలోని చందిరవొ ?