ఈ పుట అచ్చుదిద్దబడ్డది
శశికళ
114
నా ప్రజ్ఞ నా దీక్ష
విన్యాస వై చిత్రియే !
దీపావళీ...!
దీపావళీ ! రాగ
వ్యాప్తావళీ ! గతుల
తాళావళీ ! కరణ
చారావళీ ! దేవీ
నా నృత్య గీతాభి
నయ నృత్త వృత్తావళీ !
దీపావళీ....!
దీపావళీ ! రధ్య
దేవ్యావళీ ! మధ్య
శ్రుత్యావళీ ! మూర్తి
స్మృత్యావళీ ! దేవి
నా ఆశ ఆశయము
నా అవధి ఆనందమే...!
దీపావళీ...!
అసతోమా సద్గమయ
తమసోమా జ్యోతిర్గమయ
మృత్యోర్మా అమృతంగమయ.