పుట:Sangraha Andhra Vijnana Kosham Volume Three.pdf/75

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

కేరళదేశము (భూగోళము) సంగ్రహ ఆంధ్ర


గతు డయ్యెననియు తెలియుచున్నది. అతడు కేరళ చక్ర వర్తులలో తుదివాడు. మలబారులో నున్న 'ధర్మతం' అను నగరము అరక్కళ్ సంస్థానాధిపతుల రాజధాని. క్రీ.శ. ఏడవ శతాబ్దములో నే పైన పేర్కొనబడిన తుదిచక్రవర్తి సోదరి శ్రీ దేవియు, నా మెపుత్రుడు మహాబలియు ఇస్లాం మతమును స్వీకరించిరనియు, ఈ అరక్కళ్ వంశమువారి రికార్డులవలన తెలియుచున్నది. ఈ రికార్డులు అరబ్బు చారిత్రకుల వ్రాతలను బలపరచుచున్నందున క్రీ. శతాబ్దముననే ఇస్లాం మతముయొక్క ప్రసార మారంభ మైనదని నిర్ణయించుటకు అవకాశము కలదు. కలదు. షేఖు జయినొద్దీ (అరబ్బు చారిత్రకుడు) వ్రాసిన కేరళ చరిత్ర ప్రకారము 'మలిక్ ఇబ్నె దీనార్' మున్నగు 25 మంది మతగురువులు ‘కొడుంగల్లూరు' రేవునకు క్రీ.శ. 642-43 మధ్యకాలమున వచ్చి చేరిరనియు, అక్కడనే మొట్ట మొదట మసీదును కట్టిరనియు స్థానిక పాలకుల మత సహిష్ణుత వలనను, ఔదార్యమువలనను ఉత్తరమునందును దక్షిణమునందును 11 కేంద్రములను స్థాపించి రనియు తెలియుచున్నది. ముస్లిం అరబ్బుల రాకకు పూర్వమే కొచ్చి, మలబారు ప్రాంతములలో యూదులు తమ కేంద్రముల నేర్చరచికొని వ్యాపారము సాగించుచుండిరి. వారికిని ముస్లిములకును సంఘర్షణ జరిగెను. అందులో స్థానికుల సహాయమువలన ముస్లిములు విజయమును గాంచిరి. కొడుంగల్లూరు రేవు యొక్క ప్రాముఖ్యము 13. * శ. 10వ శతాబ్దమువరకు పూర్తిగా తగ్గినది. క్యాలి కటు రేవునకు ప్రాధాన్యము లభించినది. ముస్లిములు అటువైపునకు వెళ్ళి క్యాలికటు రాజులగు 'సాముద్రుల' (Zamorins) సహాయమును సంపాదించి, వ్యాపార కేంద్రములను స్థాపించి, అందుతోపాటు మత ప్రచార మును విరివిగా చేయగలిగిరి. ముస్లిముల సహాయము వలన క్యాలికటు రాజులు తమ సమానులగు కొచ్చిన్ వల్లువనాడు రాజులపై తమ ఔన్నత్యమును స్థాపించు కొనిరి. వీరి సహాయమువలన చేర చక్రవర్తి పెరుమాళ్ళ గౌరవమును సంపాదించుట కాశించినను యూరపి యనుల రాకవలన ఆ సంకల్పము నెరవేర లేదు. క్రీ. శ. 1498 తో వాస్కో డిగామా (Vasco de- Gama) అను నతడు బుడతకీచు దేశము(Portugal) నుండి

క్యాలికట్ రేవున ప్రవేశించెను. సాముద్రి (Zamorin) రాజు మొదట బుడతకీచులు ముస్లిములపై ఆధిపత్యము సంపాదించుట కంగీకరింపలేదు. బుడతకీచులు సాముద్రికి ప్రతిస్పర్థులైన ఇతర రాజులను ప్రోత్సహించి వారి అంగీ కారముతో 33 పడవలు గల నౌకాబలమును క్యాలికట్ రేవునకు చేర్చి అక్కడ సరకులతో నిండియున్న అరబ్బుల నావలను ముంచి వేసిరి. దాదాపు వంద సంవత్సరములు బుడతకీచులకును, మారుచుండు స్థానిక బలములకును, పోరాటము జరుగుచుండెను. కొచ్చిన్ రాజులు కొచ్చిన్ రేవు యొక్క అభివృద్ధిని కోరి బుడతకీచులకు సహాయ మొసగిరి. వారికి వీప్ (Weyp) అను ప్రదేశమున రేవును కట్టుటకై తా వొసంగిరి. మోప్లా (ముస్లిముల) దళ నాయకులగు 'కుట్టి అలీ, కుంజ అలీ, మరక్కారు' లు ఈ వంద సంవత్సరముల పోరాటములో బుడతకీచుల నెదిర్చిరి. కాని తుదకు వారి నావిక వ్యాపారము దెబ్బ తిన్నందున పలువురు, లంకకును, తమిళ నాడునకును కేరళము యొక్క అభ్యంతరపు ప్రదేశములకును చేరు కొనిరి. వ్యాపారవృత్తులు దిగిపోవుటచే ముస్లిములు స్థానిక భూస్వాములక్రింద వ్యవసాయవృత్తి నవలంబించిరి. అనేకులు భూస్వాములుగా కూడా మారి పూర్తిగా స్థాని కులై పోయిరి. క్రీ. శ. 18వ శతాబ్దమున మైసూరులో హైదరలీ తన రాజ్యమును స్థాపించెను. అతడు మలబారు సముద్రతీరము విదేశీయుల ఆక్రమణములో నుండుట తనకు ముప్పని 'మయ్యాజీ' అను రేవును సంపాదింప దలచెను. మలబారు ముస్లిములు ఈ అవకాశమును గ్రహించి, ఆరక్కళ్ (ముస్లిం సంస్థానాధీశుని నాయ కత్వమున ఒక ప్రతినిధివర్గమును పంపి హైదరలిని ఆహ్వా నించిరి. సాముద్రి (Zamorin) అపుడే పాలఘాట్ (Palghat) రాజుపై దండెత్తెను. పాలఘాట్ రాజా హైదరలీ సహాయము నర్థింప అతని సేనలు సాముద్రి సేనల నోడించి ఆక్రమించుకొ నేను. బూ. రా. కేరళ దేశము (భూగోళము) : భౌగోళిక పరిస్థితులు : కేరళ రాష్ట్రము భారతరాజ్యాంత ర్గతము లగు పదునైదు రాష్ట్రములలో కెల్ల చిన్నది. రాష్ట్ర పునర్నిర్మాణచట్టము ననుసరించి ఈ రాష్ట్రము 36