పుట:Sangraha Andhra Vijnana Kosham Volume Three.pdf/55

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

కేంద్రకణ భౌతికశాస్త్రము సంగ్రహ ఆంధ్ర


ప్పుడు ఈ జల్లు కొన్ని చదరపు కిలోమీటర్ల స్థలమును ఆక్రమించును. మిక్కిలి పెద్ద జల్లులను 'ఆగర్ జల్లులు' (Auger showers) అందురు. ఇంతవరకును కనుగొనిన మిక్కిలి పెద్దజల్లులో పదునాలుగువందల కోట్ల అణువు లున్నవనియు, వీటన్నిటిని జనింపజేసిన తొలి అణువు 10 " (పదివేల కోట్ల కోట్లు) ఎలక్ట్రాను వోల్టుల కంటె ఎక్కువ ఉండుననియు అంచనా వేయబడినది. మెజాన్ (Meson) : పరమాణు బీజములలోని కణ ములను దగ్గరగా నుంచు బీజ బలములను గూర్చి సిద్ధాంత పరిశోధనముల జరుపుచు 1935 లో జపాను శాస్త్రజ్ఞుడగు 'యుకావా' న్యూక్లి యనులు కలసియుండుటకు కారణము కొన్ని కణములనియు, వాటి ద్రవ్యబలము ఎలక్ట్రాను ద్రవ్యబలము (me) కంటె హెచ్చనియు ప్రతిపాదించెను. తరువాత కాస్మిక్ కిరణజనితాణువులలో మెజాను కను గొనబడెను. ఈ మెజానులలో మూడు ముఖ్య రకములు గలవు. మ్యూ (") మెజాను, పై (గా) మెజాను, బరు వైన లేక 'కె' (Heavy or K) మెజాను అనునవి. మ్యూ మెజానులో ధన ఋణావేశములు గలవి రెండును (ut, -) గలవు. సముద్ర మట్టమున నున్న కాస్మిక్ కిరణ ములలో 80 శాతము ఇదియే. వీటి ద్రవ్యరాశి ఎలక్ట్రాను ద్రవ్యరాశి కంటే రెండువందల రెట్ల కంటే కొలదిగ ఎక్కువ. వీటి సరాసరి జీవితము ఇంచుమించు సెకనులో పదిలక్ష వ వంతు. ఇవి ధన ఋణ ఎలక్ట్రాను (ప్రోజిట్రా నును అప్పుడప్పుడు ధన ఎలక్ట్రాను అని పిలచుట వాడుక) లోనికి, న్యూట్రినో లోనికి మారును. పై మెజానులలో ధన ఋణములే (గా+, గా) గాక, తటస్థములు (7° ) గూడ గలవు. వీటి ద్రవ్య సంచయము మ్యూ మెజానుల కంటె ఎక్కువ. వీటినే 'యుకావా' అణువు లందురు. వీటి సరాసరి జీవితము మ్యూ మెజానులకంటే తక్కువ. 'కె’ మెజానులలో 'టీ' (T) మెజానులు, థీటా (9) మెజా నులు అను రకములు గలవు. వీటన్నిటి జీవితము మ్యూ మెజానుల కంటే తక్కువ. వీటి ద్రవ్య సంచయము ప్రోటాను ద్రవ్య సంచయములో ఇంచుమించు సగ భాగము. హైపరాను : (Hyperon) హైపరానులలో లాంగ్డా (V), కై (=), సిగ్మా (2) అనురకములు గలవు. వీటి

ద్రవ్యసంచయము, ప్రోటానుకంటె ఎక్కువ, గురూదజని బీజము (Deuteron) కంటే తక్కువ. వీటి సరాసరి జీవితముగూడ మిక్కిలి తక్కువ. ఆంటి ప్రోటాను (Antiproton); ఆంటిన్యూట్రాను Anti-neutron) : ఆంటీ ప్రోటాను అనునది ప్రోటానుకు ప్రతియైనది. దీనిని 1955 లో ఇటాలియను శా శాస్త్రజ్ఞుడగు సెగ్రే కనుగొనెను. ఒక ప్రోటాను, ఆంటీ ప్రోటానుల జంటను సృష్టించుటకు నాలుగువందల కోట్ల ఎలక్ట్రాను వోల్టులశక్తి అవసరము. అంటిప్రోటాను, ప్రోటానులు కలిసి నాశనమై పెక్కు మెజానులు ఉద్భవించును. న్యూట్రానుకు ప్రతిఆంటీ న్యూట్రాను, స్పిన్ (spin) ఆయస్కాంతిక బిభ్రమిష (magnetic moment) ల వలన వీనిలో ఒకదానిని మరొకదానినుంచి వేరుపరచి గుర్తింపవచ్చును. న్యూట్రినో : (Neutrino) బీటా కిరణవర్ణమాల (B Ray spectrum) లోని అవిరామమును విశదపరచు టకు స్విస్ విజ్ఞానశాస్త్రవేత్తయగు 'పౌలీ', న్యూట్రినో యొక్క లేక చిన్న న్యూట్రానుయొక్క ఉనికిని 1930 లో సిద్ధాంతరూపమున ప్రవేశ పెట్టెను. అనంతరము దానిఉనికి స్థిరపరుపబడెను. అది ఆవేశము లేనిది. దాని ద్రవ్యరాశి ఎలక్ట్రాను ద్రవ్యరాశిలో వెయ్యవవంతుకంటే తక్కువ. పరమాణు బీజముల కృత్రిమరూపాంతరము : (Arti- ficial Transformation of Atomic Nuclei) స్వభావ సిద్ధములైన రేడియో యాక్టివ్ ద్రవ్యములు శక్తిమంత ములైన ఆల్ఫా కిరణములను చాల తక్కువగా ఇచ్చును. ఎక్కువ విజయముతో బీజరూపాంతరములు సాధింప వలెనన్నచో, శక్తి మంతమైన అణువులు ఎక్కువగా కావ లెను. అందుచే యంత్ర సహాయమున అణువుల వేగమును అధికముచేసి, వాటిని ఎక్కువ శక్తిమంతములుగ జేయు చున్నారు. ఇట్టి యంత్రములలో మొట్టమొదటిది కాక్రాఫ్ట్ వాల్టన్ యంత్రము (Cockroft-Walton Accelerator) 1932 లో నిర్మింపబడెను. వాండర్ గ్రాఫ్ యంత్రము (Vander Graff Generator) మరియొక టి. నేడు

సైక్లోట్రాన్ (Cyclotron), బిటట్రాన్ (Betatron), సింక్రోట్రాన్ Synchrotron), సంక్రో 16