పుట:SamskrutaNayamulu.pdf/90

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది
73

సంస్కృతన్యాయములు

మండూకతులాన్యాయము :

కప్పలతక్కెడ.

ఒకఁడొక వస్తువును తక్కెడలో నొకవైపుననుంచి దానిని తూచుటకై తనవద్ద రాళ్లు లేనందున వానికి బదులుగ రెండవవైపున కప్పలనువేసి తూచ నారంభింపఁగా కప్పలు తక్కెడలో స్థిరముగ నిలువక క్రిందికి దుముకజొచ్చెను. ఇట్లెంతసేపు తూచినను త్రాసు సమముగ నుండకుండెను.

దీనికి మండూకతోలనన్యాయము అనియుఁ బేరు.


మండూకప్లుతిన్యాయము :

కప్ప దాట్లు వేసినట్లు.

ఒకపని కొంతభాగము చేసి యది విడిచి వేఱొకపని కొంత చేయుచుండుట.


మండూకమక్షికాన్యాయము :

కప్ప, పామునోటిలో నుండియు నీఁగను మ్రింగఁబోవునట్లు.


మజ్జనోన్మజ్జనన్యాయము :

నదిలోఁబడి మఱల గట్టు జేరనేరనివాఁడు మునుగుచు, తేలుచు, రక్షకులకొఱకై వెదకుచు, చాల బాధ నొందుచుండును.

ఉదా:- సంసారసాగరములోని జీవుఁడు.