పుట:SamskrutaNayamulu.pdf/81

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది
64

సంస్కృతన్యాయములు

భల్లాతకీబీజన్యాయము

జీడివిత్తులోని పప్పులు పైబ్రద్ధల కంటుకొని యుండక విడిగా నుండును.

"ఆజవంజవమున గొంద ఱంటియండ

రరయ భల్లాతకీబీజమట్లు ధరణీ
                                         చెన్న.బ.3.386.

భల్లుకముష్టిన్యాయము

ఎలుగుబంటిపట్టిన పిడికిలి వదలింప నెవరికిని దరముగాదు. ("భల్లూకపుపట్టు" అని సామాన్యముగ వాడుదుము)

భస్మచ్చన్నాగ్నిన్యాయము

నివురుగప్పిన నిప్పు పైకిలేనట్లుండియు లొపల గణకణ లాడుదుండును. భార.విరాట. 1.322 భాస్కరరా. యుద్ధకాండ 590

భస్త్రికాలవిత్రన్యాయము

తోలుతిత్తిలో కొడవలిని దాచినట్లు.

భాండాలేజఖ్యన్యాయము

కుండమీది గీతలవలె. కుండలమీద గీతలు తప్పక ఉండవలనని నియమములేదు. ఉన్నందువలన ప్రయోజనము లేదు; ఆ గీత లుండుట కుండకు లక్షణమును కాదు