పుట:SamskrutaNayamulu.pdf/369

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది
353

సంస్కృతన్యాయములు

విషవృక్షోపి సంవర్ధ్య స్వయం చేత్తు మసామ్ర్పతం

విషవృక్షన్యాయమును జూడుము.

విషమోపి విగాహ్యతే నయ: కృతతీర్ధ: పయసా మివాశయ:

రేపు చేయబడిన జలాశయము వలె నెంత విషమ మైనను దారిచేయబడి శాస్త్రము సులభప్రవేశమున కర్హమవును.

విషం మృత్యు:

విషము మృత్యువు. (అనిన మృత్యువునకు విషము నిమితము అని భావము)

"ఆయుర్ఘృతమ్; లాంగలం జీవనమ్" మున్ంగునవిచూడుము.

విషన్య విష మౌషధం

విషమునకి విషమే మందు.

"అస్త్రమస్త్రేణ శామ్య;తి; వజ్రం వజ్రేణ్ భిద్యతే" మున్నగువానివలె

దీనినే "విషం విషేణ శామ్యతి" అందురు.

వృద్ధి మిష్టవతో మూల మపి తే నష్టం

అభివృద్ధి నపేక్షించు నీకు మొదలే నాశనమైనది. భక్ష్యము లున్న వను నాశతో పాములబుట్టకు రంధ్రము వేసి దూరిన ఎలుకకు భక్ష్యములు దొఱుకకపోగా లోపల నున్న పామువలన మరణము సంభవించునట్లు.

"చర్మతంతౌ మహిషీం హన్తి" అన్నట్లు.