Jump to content

పుట:SamskrutaNayamulu.pdf/357

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది
341

సంస్కృతన్యాయములు

య దశ్వేన హృతం పురా తత్పశ్చా ద్గర్ధభ: ప్రాప్తుం కేధోపాయేన శక్నుయాత్:

ఎన్నడో ఒకగుఱ్ఱముచే నెత్తుకొనిపోబడినదాని నాపిమ్మట గాడిద ఏయుపాయముచే తాను పొందగలదు? (పొందనేఱదని అర్ధము)

శ్రుతిశ్రవణముచే ఆశ్రుతియందు మిక్కిలి రూఢమైన మనస్సుగలవాని భావము ఆతరువాత స్మృతి వినిపించి ఆస్మృతివైపునకు మఱల్ప సాధ్యము కానేఱదు.

యద్గతం తద్గతం

పోయినది పోఉయినదే. (మఱల రాదు.)

యద్గ్రహే యదపేక్షం చక్షు స్తదధాసగ్రహేల్ పి తదపేక్షతే ఏది ఉన్నది అని తెలుసుకొనుటకు కన్ను కావలసివచ్చినదో, అది లేదు అని తెలుసుకొనుటకుగూడ కన్నేకవలసివచ్చును.

య ద్యధా నర్తతే తస్య తధాత్వం భాతి మానత:

ఏది ఎట్లుండునో యూహచే గూడ దాని కట్టిధ;ర్మమే భాసించును.

యదృదా యత్కల్రణసమర్ధం త త్తదా తత్కరొత్యేవ ఏది యెప్పుడు ఏదిచేయ సమర్ధ మవునో అది అప్పుడధాని జేసియే తీరును.

ఏకాలమున కేది రానున్నదో అ దప్పుడు రాకమానదు.