పుట:SamskrutaNayamulu.pdf/352

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది
336

సంస్కృతన్యాయములు

ఆవసరకాలమున చేయదగినపనిని వదలి కాలాస్తతమునతద్విషయము విచారిఅంచుట వ్యర్ర్హమని న్యాయాతియము. "కృతే కార్యే కిం ముహుర్తప్రశ్నేన?; కృతక్షౌరస్య నక్ధత్రపరీక్షా, న హి వివాహాన న్తరం వరపరీక్షాశ్రయతో మున్నగువానిని జూడుము.

ముని ర్మమతే మూర్ఖో ముద్యతే

ఒక ముని బ్రహ్మను మననము చేయగా నొక మూర్ఖుడు ముక్తుడైనాడట. (మునిర్తృక ధ్యానాదివిధిఫలమైన సాక్షాత్కారము మునికే సంభవింప వలయునుగాని మఱొక మూర్ఖునకు కలుగదు.)

"కృష్ణతాడనా ద్ధంతభంగ:; కాచి న్నిషాడీ తనయం ప్రసూతే కశ్చిన్నిషాదస్తు కషాయపాయీ" అను వాని విధమున.

మనం: కిసలాయతే

రోకలి చిగిర్చె నన్నట్లు. (అసంభవ మని భావము.)

"గుండ్రాతికి కాళ్ళు వచ్చి గునగున నడచెన్" మాదిరి. మూషికభక్షితబీజాదా వంకురాదిజననప్రార్ధనా

ఎలుకలు తినిన విత్తనములలో నుండి అంకురములు మొలకెత్తుటకై చాల ప్రయత్నము చేసినట్లు.

"దగ్ర్హబీజాంకుర" న్యాయమును జూడుము.