ఈ పుట ఆమోదించబడ్డది
14
సంస్కృతన్యాయములు
- (పందికి పందిపిల్లలు పుట్టినను లాభము లేదు; ఏనుగ కొక పిల్ల పుట్టినను చాలును.)
- కర్కటీగర్భన్యాయము
- పీత పిల్లలు పుట్టినతోడనే చచ్చును.
- భార. విరా. 1 ఆ. 322.
- కాకతాళీయన్యాయము
- కాకి వాలగానే అప్రయత్నముగా తాటిపండు పడినట్లు.
- విక్ర. 4.61.
- కాకత్రోటిబింబన్యాయము
- కాకిముక్కున దొండపండు గట్టినట్లు.
- రుక్మి. 1.132.
- కాకపికన్యాయము
- కోవెల కాకులచే బెంచబడినను కాకి కాకియే, కోవెల కోవెలయే. (కాకః కాకః పికః పికః.)
- కాకాక్షిగోలకన్యాయము
- ఒంటికంటిచూపు గల కాకికి రెండు కన్నులు ఉండియేమి ప్రయోజనము ?
- కాకరుతన్యాయము
- పగలు కాకికూత విని జడిసి కాంతుని కౌగిలించుకొన్న కాంత రాత్రి నర్మదానదిని దాటి వెళ్లినదట.