పుట:SamskrutaNayamulu.pdf/217

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది
200

సంస్కృతన్యాయములు

అశ్చతరీగర్భన్యాయము

కంచరగాడిదె చూడి మోసి ఈనినవింటనే చనిపోవును. వృశ్చికీగర్భన్యాయమును జూడుము.

అశ్వభృత్యన్యాయము

వీ డెవనిభృత్యుడో వానిది ఈగుఱ్ఱము; ఈగుఱ్ఱావనిదో వానికి వీడు భృత్యుడు అని నిర్దేశించిచెప్పినట్లు.

అసంజాతవిరోధిత్వన్యాయము

పుట్టనివనిపై తనకు విరోధియని వైర మూనినట్లు.

అజాతపుత్రగుణోత్కెర్తనన్యాయమువలెనే.

అసిదాధారామధులేహనన్యాయము

కత్తిఅంచుననున్న తేనెను నాకినట్లు.

"కామై ర్నతృప్తి: సంసారే క్షురధారామధూపమై:"

అహినకులన్యాయము

వ్యాలనకులన్యాయమును జూడుము.

అహినిర్లయినీన్యాయము

పాముకుబుసముమాదిరి.

కుబుసమువిడిపోక తన కంటియున్నంతదనుకపాము అది తనదేహమే అనుకొనును; విడిపోయినతరువాత పామునకు కుబుసముతనది అనే జ్ఞానమే ఉండదు.

జ్ఞానోదయమై అన్ఞానావరణముతోబాటు దేహాభిమానము నశించినవెనువెంటన తొలుత గల నాదేహము అనుభ్రాంతియే జ్ఞాననికి నశించును.