పుట:SamskrutaNayamulu.pdf/125

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది
108

సంస్కృతన్యాయములు

కొల్పిన పాఱినకు వ్యయము తగ్గకపోగా పైపెచ్చు మిక్కుట మయ్యెను.

రెండవమా ఱొనదించిన ప్రయత్నముచే ఆవిప్రుని భార్యా నియోగదూపమవు మొదటిప్రయత్నము సర్వధా బాధింపబడెను. అనగా నిష్ప్రయోజనమయ్యెను.

అట్ట్లే- సంప్రాప్తమయిన అనిష్టమును పోగొట్టుకొనుటకై వేఱొకత్రూవం బోవ ననిష్టవృత్తి కలుగకపోవుటయే గాక మొదటి యనిష్టమే వెనుకటికంటె మిక్కుటముమవుటవల్ల నీన్యాయ ముపయోగింపబడును.

మధ్యఘాతకన్యాయము

వధింపబడువారు, వధించువారు నొకేచోట నుండరు. సహజవైరులవు పాములు, మొంగీసలు, ఎలుకలు, పిల్లులు; మున్నగునవివలె, అంతియగాక---

ఇచట పాములెక్కువగ నున్నవి అనిన ముంగిసలు లేవు అని స్ఫురించును. ముంగీసలు ఉన్నయెడల పాములధికముగ నుండు టసంభవము. అట్లే ముంగిస లిచట నిక్కువగ నున్న వనిన పాములు తక్కువ అని చెప్పకయే తెలియవచ్చును. అట్లే ఎలుక లెక్కువగ నున్నవనిన పిల్లులు తక్కువ యనియు, పిల్లు లెక్కువ యనిన ఎలుకలు తక్కువ యనియు చప్పకయే ఆయావాక్యములచేత ఆక్షిప్తము లవుచుండును.