పుట:SamskrutaNayamulu.pdf/101

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది
84

సంస్కృతన్యాయములు

మూలక్రిమిన్యాయము

వేరులో పురుగు పుట్టిన చెట్టంతయు చచ్చిపోవును.

మూషకవిషాణన్యాయము

ఎలుకకు కొమ్ములు పుట్టినట్టు.

శశవిషాణమువలె అసంభవము.

మూషకాహిమంజూషాన్యాయము

ఎలుక పాములబట్టునుచూచి యం దేమో కలదని భ్రమించి కన్నము పెట్టి లోపలికి దూరగా, పాము దానిని బట్టి భక్షించి ఆకన్నమునుండియే యావలకుఁ బాఱిపోవును.

మంజూషాఖున్యాయము జూడుము.

మూషాసిక్తతామ్రన్యాయము

కఱఁగి మూసలోఁ బోసిన రాగియట్లు.

"చక్షురాదిద్వారా బహిర్నిఃసృతస్యాంతకరణస్య మూషాసిక్తతామ్రన్యాయేన విషయాకారతా భవతి."

చక్షురాదులద్వారా బహిర్గతమయిన అంతఃకరణమునకు మూషాసిక్త తామ్రమునకువలె విషయాకారత్వము కలుగును.

"మూషాసిక్తం యథా తామ్రం తన్నిభం జాయతే తథా, రూపాదీ న్వ్యాప్నువచ్చిత్తం తన్నిభం దృశ్యతేధృవమ్‌."

ఆచార్యులవారి- ఉపదేశసాహస్రి.