పుట:Sahityabashagate022780mbp.pdf/78

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

72

వచ్చునని అధికారపత్రం పుట్టించారు. గ్రాంధికవాదులు అలజడి పొంది దేశం అంతా సబలుచేయించి వ్యవహారభాషా శైలిదే తెలుగుభాషకు తెరని అపకారం జరుతుందని ప్రభుత్వానికి మహజర్లు పంపించారు. ఇదేసమస్య విశ్వవిద్యాలయ రంగంలో కూడా తలయెత్తింది. ఇంటర్మీడియటు విద్యార్ధులు తెలుగు కాంపోజిషను ఏ శైలిలో రచించజలనేది వివాద విషయమయింది. అప్పటి మద్రాసు విశ్వ విద్యాలయం వారు ఒక కాంపోజిషను కమిటీని ఏర్పరచి వారి సిఫార్సులను కోరారు. దానిలో గురజాడ అప్పరావు, గిడుగురామమూర్తి పంతులు, కొమర్రాజుఇ లక్షమణరావుపంతులు, వేదం వెంకట్రాయ శాస్త్రిగారు మొదలగు హేమాహేమీలు సభ్యులుగా నియమితులయారు. ఈ కమిటీ సమాలోచనలు రెండుసంవత్సరాలు సాగాయి. వ్యూహ ప్రతివ్యూహాలు నడిచాయి-తమతమ వాదాలన్ సమర్ధిస్తూ ఆనాటి సారస్వతీయులైన పెద్దలంతా రచనలు వెలువరించడారు. వావిలికొలను సుబ్బారావుగారి 'ఆధునిక వచనరచననా విమర్శనము ' 'గ్రామ్యా గ్రామ్య వివాదపీఠిక '; వేదంవెంకటరాయశాస్త్రైగారి 'గ్రామాదేశ నిరసనము ', గిరుడు సెతాపతి గరి 'సొడ్డు ', గిడుగురామమూర్తి పంతులుగారి Mmorandum on Modern Telugui జయంతిరామయ్య పంతులుగారి Defence of Literary Telugu ఈ విధంగా వాదప్రతివాద గ్రంధాలు పుంఖానుపుంఖంగా ఆవిర్బవించాయి. వీటన్నటికీ శిఖరాయమానమైనది గురజాడ అప్పారావుగారి Minute of Diss అను రచనము ఏమైనప్పటికి మద్రాసు విశ్వవిద్యాలయమువారు "ఆధునిక వచనారీతి" అనేదాన్ని ఆమోచింప జాలరని 1915 సంవత్సరంలో తుద్పరుష్కారం ప్రకటించారు. విశ్వవిద్యూఅలయాన్ని బట్తి విద్యాశాఖాదికారులు పాఠశాలల్లో ఆధునిక భాషారచనకు కల్పించిన అనుమతిని ఉప సంహరించుకున్నారు. గ్రాంధిక భాషావాదము విజయాఅనందంతో చెయ్యివీచింది. వ్యావహారికభాష తాత్కాలికంగా విద్యారంగం నుంచి వెలివేయబడింది. ఇంతలో గురజాడ అప్పారావుగారు తివంగతులయారు. రావుసాహేబు గిడుగురామమూర్తి పంతులుగారొక్కరే అచంచంల విశ్వాసంతో స్థిరసంకల్పంతొ శేషజీవితమంతా వ్యావాహారిక భాషా ప్రచారానికి అంకితం చేశారు.

    రామమూర్తిగారు ఏకాకులుగా కనిపించినా వారి వాదము ఏకాకిగా ఉండలేదు.  పూర్వ పండితులంతా దీనిని కాదన్నప్పటికీ యువలోకము వ్యవహార భాషను తమ సాహిత్య రచనలనే పూలపడవలలో ఎక్కించి కాలతరంగిణిలో వదలడం ఆరంభించారు.  గురజాడవారి 'ముత్యాలసరాలు ' 'దేశామును ప్రేమించుమన్నా ' 'లవణరాజుకల ', 'పూర్ణమ్మకధ ' వంటివి రాయప్రోలు సుబ్బారావుగారి 'తమ్ముడా ' అనే గేయము వారికి