పుట:Sahityabashagate022780mbp.pdf/44

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

కూడ మనకు అనుగ్రహించాడుకాడు. వాల్మీకి, వ్యాస, కాళిదాస, భారవి, బాణ్, ఉద్బటుడు. ఇంతమంది సంస్కృత కవులపేర్లు చెప్పుతూ ఒక్క దేశి సత్కవిని కూడా పేరు ఎత్తాడు కాడు చాళుక్యులు తెలుగును నిలిపారని ప్రశంసించాడు. ఆ చాళుక్య రాజు పేరు చెప్పడు. ఈయన చేపట్టిన వస్తువు శివలీలలు, కుమారస్వామి జననము- ఇవి మార్గకవితావస్తువులే కాని దేశీయములు కావు. పురాణ ప్రసిద్ధమైన కధలు, అయితే నన్నెచోడుడు చేసిన దేశి కృషి ఏమిటంటే ఈ పూర్వకధనే దేశీయ పద్దతుల కనుగుణంగా మలవాలని ప్రయత్నించాడు. ఈ సందర్బంలోనే ఇతడు జాను తెనుగుప్రశంస తెచ్చాడు.

     సరళము గాగ భావములు జానుదెనుంగున నింపు పెంపుతో
     బిరిగొనవర్ణనల్ ఫణితి పేర్కొన నర్ధములొత్త గిల్లి బం
     ధురముగ బ్రాణముల్ మధుమృదుత్వ రసంబున గందశింప
     సక్షరమ్లు సూక్తులార్యులకు గర్ణర సాయనలీల గ్రాలగాన్, కుమార. 1-86

      ఇతడు నన్నయ చెప్పని అలంకార శాస్త్ర నియమాల్ని చాలా పేర్కొన్నాడు.  కావ్యంలో అది పాటించాలి అంటాడు ఇందులో అక్షరములు సూక్తులు మాత్రమే నన్నయ ప్రత్యేకంగా పేర్కొన్నాడు.  నన్నెచోడుడు ఉద్దేశించిన జాను తెనుగు స్వరూపం ఎటువంటిదో అతడ్ వివరించలేదు.  అతని గ్రంధాన్నిబట్టి కొంతకు కొంత ఊహించవలసిందే, మార్గ కవితా వస్తువు వలెనే మార్గశైలిని కూడా నన్నెచోడుడు నిరసింపలేదు.  నన్నయమల్లేనే సంస్కృత సమాస నిబిడమైన రచన్ అ సాగించాడు.  సామాన్య జన వ్యవహారానికి ఎక్కువ సన్నిహితమగు ప్రయోగపద్దతిని అవలంబించాడు. లోపదీర్ఘ రూపాలు, మోము-మొగము అనుటకు, వైరాన-వైరము అనుటకు మోదాలు.  తిక్కన కాలానికి ఇవి ప్రామాణికత్వం సంపాదించుకున్నాయి.  ప్రాణానంగలవె అని తిక్కన ప్రయోగించాడు.  ఇకారసంధి, వాయుడుపక, వాయి+ఉడుపక మచాలవు-మంచ్+అలవు. క్వార్దేతో నభవేత్పదా-క్వార్ధక ఇకాతమునకు సంధిరాదని ఆంధ్రశబ్దచింతామణి. నామమగమైన ఇకారానికి అప్పుడప్పుడు కనబడుతూనే ఉంది.  షష్ఠీ అకారసంధి-దేహేంద్రియబులిర్చలు సంస్కృత శబ్దమ్లలో స్వరభక్తి చేసిన రూపముతో సమానము చేయుటకు కలుహార గంధి (కల్హార అనుటకు). ఇదే బరిహికేశ్డభరంబు; హరుషాశ్రుధారలు వంటివి. తద్బవ రూపంతో సమాసం చెయ్యడం, ఆరదాశ్వభట తతి.