పుట:Sahityabashagate022780mbp.pdf/35

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

మహాభారతంవంటి విజ్ఞాన సర్వస్వ గ్రందంలో తెలుగుభాషలో అచుంబితములైన ఎన్నో విషయాలున్నాయి. మతము, వేదాంతము, రాజనీతి, యుద్దతంత్రము మొదలైన బహుళ విషయాలున్నాయి. వీటినన్నింటిని అప్పుడు తెలుగులో ఉన్న పదజాలంతో చెప్పడం సాధ్యపడియుండరు. అందుకోసమే నన్నభట్టు ఆ యా సందర్భాలకు అవసరమైన పదజాలాన్ని సంస్కృతభాషలోంచి ఎరువు తెచ్చుకున్నాడు. ఆయన ప్రదర్శించిన జాగరూకత ఏమిటంటే ఆ సంస్కృత పదాలు అసభ్యస్తాలు కాక తెలుగువారికి కొంతవరకైనా పరిచితమై ఉంటాయి. ఈ ప్రక్రియలో కన్నడభాషా మర్యాదలు నన్నయకు కొంత తోడ్పడి ఉంటాయి. 'ఇంచుక్ ' అనే ఆగమనాన్ని సంస్కృతపదాల్ను చేర్చి వాటిని తెలుగులో ప్రయోగార్హాలుగా చేసుకొన్నాడు. ఈ విదానము నన్నయకు ముందు లేకపోలేదు. రక్షించు వంటి ధాతువులు శాసనాల్లో ఉన్నాయి. కొన్నింటికి తెలుగు ధాతువులను సహాయ ధాతువులుగా చేసి శబ్దపల్లవ ధాతువుల్ని కల్పించడము ప్రసారం చేయు శాసన భాషలోనే కన్పించింది. సహాయ ధాతువులుగా చేయు, ఇచ్చు, ఇంచు, ఇల్లు, తెంచు (ఏకుదెంచు) పడు, పరచు, వంటివి పెక్కు ఉపకరించాయి. తత్సమధాతువు లేర్పడే విధానాన్ని ఆంధ్ర శబ్ద చింతామణి ఉపకృతి, సంవృతి,పరిణితి క్రియలక్రించ విభజించి నిరూపించింది. నామ ప్రకరణంలోఅజంత హలంత శబ్దాలలు ఏర్పడే విధమూ, నాటిబహువచనరూప్లాలు,విభక్తి ప్రక్రియ వీటినన్నింటినీ నన్నయ ప్రమాణీకరించాడు. వ్యాకరణ గ్రంధాల్లోఇవి వివరింపబదిఉన్నాయి. నన్నయ వాడిన కొన్ని విభక్తి ప్రత్యయాలు ఇప్పుడు వాడుకలోలేవు. చేసి, మెయి, పొంటెన్, కోలెన్ వంటివి. కారక విషయంలో కూడా స్వీకరించాడు. ఉపయోగంబునందాఖ్యతకు తోడవర్ణకమగుట సంధి, సమాసము వంటి వాటిల్లో కూడా నన్నయ దిద్దిన మార్గమే శరాభ్దాలవరకూ నిలిచి పోయింది. అనగా తెనుగు భాష హృదయాన్ని ఆయన ఆకళింపు చేసుకున్నంతగా అతని పూర్వులుకాని అనంతరులుగాని ఆకళింపుచేసుకోలేక పోయారు. అందుచేతనే వాగను శాసన, శభ్ద శాసన బిరుదాలు ఆయనకు అన్వర్ధము రూధమయి నాయి. విపుల శబ్ద శాసన బిరుదము తనకున్నట్లు నన్నయయే చెప్పియున్నాడు.

    ఎటువంటి సంస్కృత పదాలు తెలుగులో ప్రవేశించవో శభ్దచింతామణి చెప్పింది.  'నవదాన్యవ్యయసున్ తిజ్ క్త్వాతుమునాం ' అన్యయములు, నుబంతములు, తిజంతములు, క్త్వాప్రత్యయములు, తుమున్నంతములు తెలుగులో వ్యస్తంగా వాడబడవు.  సంస్కృత వాక్యాన్నిమొత్తంగా తీసుకొని దానికి అనుధాతువు చేర్చి వాడుకోవచ్చును. దీనినే అను