పుట:Sahityabashagate022780mbp.pdf/33

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

కావ్యభాషా నిర్మాణము

  దేశభాషా యుద్ధంలో భారత యుద్ధమునందు అర్జునునకు శ్రీకృష్ణునివలె నారాయణభట్టు అన్ మహావిద్వాంసుడు నన్నయకు అండగా నిల్చినాడట.  దేశభాషా కావ్య రచనన్ వ్యతిరేకించిన విద్వాంసులు ఎందుకు వ్యతిరేకించారో నన్నభట్టు చెప్పలేదు.  ముఖ్యంగా రెండు కారణాలు చెప్పవచ్చును. (1) సంస్కృత భాషయందు వారికిగల అపార గౌరవము, విశ్వాసము (2) మహాభారతం వంటి ఉద్గ్రంధ రచనకు దేశభాషయైన తెలుగు సమర్ధమైనది కాదని ఇటువంటి చిత్తవృత్తి అన్ని కాలాల్లోను ఉంది.  ఇన్నూరు సంవత్సరాలనుండి ఆంగ్లబాషా తేజస్సుచే మిరుమిట్లుగొన్న చూపులుకలవారు మనవారిలో చాలామంది దేశభాషలఓ ఆ విజ్ఞానాన్ని సంతరించడం అసాధ్యమని ఇప్పటికీ వాదించడం లేదా, అవేదనపడడం లేదా, నన్నయ రాజరాజుల కాలంలో కూడా ఇట్లాగే జరిగింఉంటుంది, వారి ప్రాతికూల్యము దేశబాధకు కాదు, దేశభాషా సామర్ధ్యమునకు, నన్నయ నారాయణభట్టులు, ఈయుద్యమానికి సుముఖంగాఉన్న పండిత పరిషత్తులు అక్ందరూ కలిసి దేశభాషా సామర్ధ్యాన్ని పెంపొందింప జేయడానికి పూనుకొన్నారు.  విజయం సాధించారు.  రామరాజబూషణుడు చెప్పినట్లు బహుళాంధ్రో క్తిమయ ప్రపంచాన్ని ఆవిర్భవింపజేశారు.

కావ్యభాషా నిర్మాణము

  కావ్యోచినతమైన దేశభాష నిర్మించుకోవడంలొ నన్నయాదులు రెండు మూడు నియమాలు పెట్టుకొన్నారు.
  1) సుశబ్దప్రయోగము లేదా ప్రామాణిక శబ్దప్రయోగము.
 2) తెలుగులొ కనబడక, కావ్య ప్రయోజనాలకు అవసరమైన శబ్దజాలాన్ని సంస్కృత భాషనుంచి అవతరింప చేసుకొవడం.

3) అట్లా ఎరువు తెచ్చుకోవడంలో ప్రస్దిద్ధ సంస్కృత పదాల్నే ఎన్నుకుంటూ మారుమూలపదాల్ని పరిహరించడం.

  నిలొమక్రమంలో వీటిని కొంచెం వివరిస్తాము, మారుమూల పదాల్ని పరిహరించడం, ఆంధ్రశబ్ద చింతామణి ఈవిషయాన్ని స్పృశించింది.

    'పేరోషాదికశబ్దాన్ ప్రచ్యాహరంతు శబ్దజ్ఞా:
    ఇహతు ప్రవ్యాహర్యమే సంకేతిత సుప్రసిద్ధ మెనపదం "