పుట:Sahityabashagate022780mbp.pdf/24

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

విక్రమాదిత్య మహారాజు రాజ్యము చేయుచుండగా ఆయన రాణి చోళమహాదేవి, ఉత్తమాదిత్యునితో కలిసి (కుమారుడు కావచ్చును)

       చిఱుంబూరు (చిలంకూరు)లో సామంత పరిపాలన చేస్తూ గ్రామంలోని ఏడు గురు బ్రాఃమణులకు పన్నులలో కొంత రాయితీ చేసి ఒక ఎకరం భూమి ఆ దంచ్రార్కంగా దానం చేశారు.  దీనికి తొల్స కామయరెడ్డి మున్నగు రెడ్లు సాక్షులై యుంటారు  లేదా వారు వేరే దానం చేసి ఉంటారు. దాని విఘాతకులకుశాపోక్తి కలదు విక్రమాదిత్యుడు ప్రధాన నగరంలో ప్రభుత్వం చేస్తుండగా కుమారుడైన ఉత్తమాదిత్యుడు ఆయన అదికారానికి లోబడి యువరాజుగా చిలంకూరులో నిలపబడ్డాడు.  ఈతడు ప్రాజ్ఞుడు కాకపోవడంచేత కాబోలు తల్లియైన చోళమహాదేవి అతనికి సంరక్షకురాలుగా వ్యవహరిస్తూంది.  ఇది ఈ శాసనంలోని చారిత్రక సన్నివేశము.
      వెనుకటి శాసనంలో కన్న దీనిలో తెలుగు వాక్యరచన క్రమబద్ధంగ నడిచింది.  అసమాపక వాక్యం ముందు వచ్చి సమాపక వాక్యం తరువాత వచ్చింది.  సమాపక వాక్యంలోని బాగమైన "ఆ చంద్రార్కంబు నిల్వ" అనేది ప్రసారంచేసిన అనే సమాపక క్రియ తరువాత రావడం కొంత విశేషం.  ఇప్పటి తెలుగు వాక్యంలో సమాపక క్రియ చిట్టచివర వస్తుంది.  అన్నంత క్రియయైన 'ఏలన్ ' తరువాత కా, గా అనేవి వాడబడడంలేదు.  ఇవి ఆగుధాతు రూపాలు.  ప్రసాద చేసిరి అన్నప్పుడు ఔపవిభక్తిక సప్తమారూపము. తృతీయాసప్తములకు అత్వం వచ్చుట కలదు. ఏడు అస్నుటకు ఏళుపాఱ్గ అని వ్రాయుట ళడల ఆభేదాన్నిసూచిస్తుంది.  పాఱ అనేది విచిత్రంగా వినిపిస్తుంది.  పాఱుడు బ్రాహ్మణుడు వర్ణ విరహితంగా పాఱ అనురీతిని ఈ శభ్దాన్నివాడేవరు కాబోలు.  దీని బహువచనం పాఱ్లు.  రట్టగుడు-కట్టగుళ్ళు రాష్త్రకూటి శబ్ధభావమనిఈ, రెడ్ది శబ్దానికి పూర్వరూప మనీ భావిస్తున్నారు.  రాష్త్రకూటులనగా గ్రామాధికారులు గ్రామపెద్దలు.  వీరు ఈదానానికి సాక్షులో నిర్వాహకులో అయిఉంటారు.  అమలుపరిచేసారని తోస్తుంది.  అన్నింటికన్న వింతయైన భగము 'తేనిళచ్చు ' 'తేని ' అనేది 'దేని 'శబ్దపు పూర్వరూపం తెలుగు శబ్ధాలు పరుషాదిగా ఉండేవని చెప్పియున్నాము.  ఏది అనుసర్వనామముయొక్కసంబంధార్ధకరూపం.  దీనిని బట్టి సంబంధానర్ధక సర్వనామాల్తో వాక్యాలను కలపడం ఆనాటికే ఉండేదన్నమాట.  అందుచేతనే నన్నభట్తు 'ఎయ్హదిహృద్యము. ఆ కధయవినగ ఇష్థము మాకున్ ' అని వ్రాసినాడు.  ఇంక శచ్చుపదము, ఇది బహుశా అచ్చు