పుట:Sahityabashagate022780mbp.pdf/22

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

క్రీ.శ. 6 వ శతాబ్ది భాగంలో చిన్నచిన్న వాక్యరచన తెలుగు శాసనాలు మనకు లభీస్తాయి. ఇవి కడపజిల్లా ప్రాంతంలో పరిపాలించిన రేనాటి చోళులవి. పరిశోధకులకు లభించిన మొదటి తెలుగు శాసన స్వరూపం చూడండి. ఇది కడప జిల్లా ప్రాంతమ్లో కలమళ్ళ గ్రామంలో కనబడిన కాలము క్రీ.శ. 575 ప్రాంతము శాసన పాఠం.

          కల్ ము (తు) రాజు
          ధనంజయుఱు రేనాండు ఏలన్
          చిఱుంబూరి రేవణకాలు (పం)పు
          చెనూరు రాజు అశికల (ఊ) రిందవారు
(పంచ( (మ) హాపాతకసకు

    కుండలీకరణము చేయబడినవి అక్షరములు పోగ శాసన పాఠము సందర్భాను కూలముగా సమకూర్చినవి.  దీని అర్ధం ఇట్లా చెయ్యాలి "ఎఱికల్ ముతురాజు దహంజయఱు రేనాడు ఏంగా అనగా అరిపాలిస్తూ ఉండగా చిరుంబూరి రేవణగారి పంపును ఆజ్ఞపై లేక ప్రేరణమీద చెబూరుకాజు, (మరియు) అశికళ ఊరివారున్నూ--ఏదో దానం ప్రకటించాడు.  ఆధర్మ ప్రతిష్ఠాపనకు విఘ్నము చేసినవారికి పంచమహా పాతకములు అగు." శాసనంలో దానమిచ్చిన భాగము శిధిలమైపోయింది.  దీనిలోని భాషా విశేషాలు కొద్దిగా గుర్తిస్తాము. ధనంజయుఱు అనె పదంలో 'రు ' ప్రత్యయము గౌరవార్ధక ప్రత్యయముగా గ్రహించాలి  ఏకవచనమేకాని పూజ్యార్ధమున బహువచనము.  కృష్ణదేవరాయలవారు అన్నట్లు ఇప్పుడు మనము దీర్ఘముమీద పూర్ణానుస్వారము వాడము.  చిన్నయ సూరిమాత్రం కూడా అట్లాగే చేశాడు.  కాని ప్రాచీన కాలంలో 'నాండు ' నాడు, వాడు అన్నట్లు అలికేవావారు.  వ్రాసేవారు అందుచేత రేనాడు రేనాండు అయింది.  ఏలన్ ఏలుచుండగా, అన్నంత ప్రత్యయము సాహిత్యభాషలో తరుచు కనబడుతుంది.  ఇప్పుడు మనము ఏలగా అని అంటున్నాము. చిరుంబూరి అన్నప్పుడు ఔపవిభక్తిక 'ఇ ' వర్ణం కనబడుతూంది.  రేవణకాలు అన్నది రేవణ గారు కావచ్చును.  కాలు అనేది సాధారణ గౌరవవాచమ పదము.  పంపు-పనుపు-పనుచు-ఆజ్ఞచే అనుట భారతంలో తరుచువస్తుంది.  ఆశికళ ఊరిందవారు.  ఆశికళ గ్రామవాసులు, ఊళ్ళోవారు అనుట.  అందు, ఇందు, ఎందు- అనే స్థలవాచకములు నన్నయకు మిక్కిలి సమ్మతములు.  ధాన విఘాతకుడు పంచమహాపాతకుడగును అని శాసనంలో వ్రాయడం మామూలు చిట్టచివరవచ్చిన 'ఆకు ' అగు భారు ప్రాచీనరూపము.  ఈ ధాతువులో నన్నయకాలం నుంచీ సరళ వర్ణం వచ్చింది.  ద్రావిడ భాషా సంప్ర