పుట:Sahityabashagate022780mbp.pdf/14

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

ఈ రహస్యం కనిపెట్టేకాబోలు నన్నయాదులు తమ దీర్ఘతను రచనల్లో చంపూశైలినే కాక చందోవైపుణ్యాన్ని కూడా పాటించారు. పాల్కురికి సోమనాధుడు ఇంచుమించు అంత దీర్ఘ రచనలుచేస్తూ ఏకైక చందస్సున్ అనగా ద్విపదను అధ్యంతం నిర్వహించాడు. దేశిచ్చందోగౌరవంచేత మనం దానిని పరిగ్రహించినా మనసార ఆస్వాదించలేకుండా ఉన్నాము. వందలకొద్దీ ద్విపదలు వరుసగా చదువుతూంటే రోకటి పాటగా విసుగు కలిగిస్తుంది. ద్విపద సౌందర్యమూ, ప్రయోజమూ దానికిలేకపోలేదు. ఆంగ్ల మహాకవి మిల్టను తన Paradise Lost అనే కావ్యాన్ని ఆద్యంతమూ Blank verse అనె చందస్సులో నిర్వహించలేదా? అది విసుగు పుట్టించలేదా? అంటే అక్కడ తద్బాషావిరుల అభిరుచియే ప్రమాణము. ఒకే చందస్సు వాడడంలో వచ్చే Monotony ఊకదంపు లక్షణాన్ని గతవైవిద్యంచేత మిల్టను వారించుకున్నాడని అంటారు. పాల్కురికి సోమనాధుని దృష్టి కావ్యశిల్పంమీదకన్న శైవమత ప్రచారంమీద అధికంగా లగ్నం అగడంచేత ఇట్లాంటి మలకువలను ఆ మహారచయిత ఉపేక్షించాడు.

   రచనావైదిధ్యం సాధించడానికి చందోవైవిధ్యం భాషానైపుణ్యం కావాలని అన్నాము.  భాష అనేది లోకంలో ఏర్పడి సిద్ధంగ ఉంది కాని కవి అధీనములో లేదు. 'సిద్ధిర్లోకద్దృశ్యా ' అని పేద్దలు చెప్పనేచెప్పారు.  ఎంత ఘనుడైన కవి అయినా, వాగనుశాసనుడైనా, కవిబ్రహ్మ అయినా, కవిసార్వభౌముడైనా, కవితా పితామఃఉడైనా సరే అతనికి క్రొత్తశబ్దనిర్మాణంలో అధికారంగాని, సాఫల్యంగాని తక్కువ. లోకంలో వాడుకలో ఉన్న పదజాలాన్నే వాడుకోవాలి.  ఈ పదజాలంకూడా యుగయుగానికి కొంచెం భెదిస్తూ ఉంటుంది.  ఆర్ధికరంగంలో లాగే బాషారంగంలోకూడా మార్పులు వస్తూంటాయి.  పాతనాణాలు పోయి క్రొత్తనాణాలు చెలామణీలోనికి వస్తూంటాయి.  క్రొత్త రాజరికంవస్తే పాత రాజరికంతాలూకు నాణాలన్నిటినీ కరగపోసి నూత్న గద్యాణములు వాడుకలోకి తేవచ్చును.  భాషారంగంలో ఇంత సర్ఫవ్యాప్తియైన మార్పురాదు.  వస్తే అది ఆ పూర్వభజ్ష కానేకాద్.  వేరేభాష అవుతుంది.  అల్యినప్పటికీ శబ్ధాలు రూపంలో అర్ధంలో సరిక్రొత్త రూపాలుదాలుస్తూ ఉంటాయి.  అర్దవిపరిణామ శాస్త్రం ఈ సన్నివేశాన్ని వివరిస్తుంది.  ఒక నదీప్రవ్ఫాహంలో ఉపనదులు వచ్చి కలిసినట్టు ఒక భాషాప్రవాహంలో అన్యభాషాపదాలు వచ్చి చేరుతూ ఉంటాయి.  తను రూపం కొంత మార్చుకొని దేశపదజాలంగా చెలామణి అయిపోతూంటాయి  భాషాశాస్త్రంలో ఇటువంటి ఆచారప్రధానాలను గూర్చి చెప్పడం జరుగుతుంది. కివిత్వంలో బాషావైవిధ్యం సమ