పుట:Sahitya Memamsa, Sripada Kameshwar Rao.pdf/85

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

63 రక్తపాతము

శ్రీరాముడు సరయూనదిలో నంతర్ధానమగుట, పాండవులు హిమాలయమున నంతరించుట మొదలగు కల్పనల మూలమున ఆర్యకవులు హత్యల బహిష్కరించిరి - హత్యలవలన పాత్రములు అంత మొందించుట కంటె యీ తెరగున వాటి నపసరింపజేయుట నూరుమడుగులు మేలుగదా? హత్యలచేత పాత్రాపసరణము చేయుటే నాటకకౌశలమా? ఉపాయాంతర మేమీ కానరాదా? ఆర్యసాహిత్యమందలి స్వర్గారోహణాదులు కల్పించుటా కౌశలమే. "మధురేణ సమావయేత్" అను కావ్యసూత్రము ననుసరించి అట్టికల్పన చేయబడెను. హత్యాసంచయముతోనే గ్రంథసమాప్తియైతే పరిణామము బీభత్సము కాకతీరదు. అట్టిపర్యవసాన మతినింద్యము కావు ననే ఆర్యకవులు దానిని వర్జించినారు.

"హత్యాకాండ మంతటా రాదు, ఆవశ్యకమగు చోటనే అవతరించును. డెస్‌డెమోనాహత్య అవశ్యంభౌవి వ్యాపారము, ఒథెలో కథాంతర్గతము, అదిలేకున్న ఆతని పాత్ర పోషింపబడదు. ఘటనాక్రమమున ఆనాటక మట్లే పరిణమించవలయున"ని కొందరి అభిప్రాయము. తథాస్థు, కాని ఇది "విషయనిర్వాచన" మను దోషమని యెంచనగును. ఘటనాచక్రమును పరివర్తనము చేయనేరని కవిప్రతిభ ప్రశంసనీయముకాదు. షేక్స్‌పియరు ప్రతిభ అట్టిదనుట సాహస మందురా? ఆతనిప్రతిభ ఇట్లు మొక్కపోవుటకు ఆతని రుచి దోషమే హేతువు. హత్యాకాండము ఆనందదాయకమని